Shilajit : ఆరోగ్యంగా ఉండడానికి మనం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. విటమిన్ సప్లిమెంట్స్, మల్లీ విటమిన్స్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, బి కాంప్లెక్స్, విటమిన్ సి, విటమిన్ డి ట్యాబ్లెట్స్, ప్రోటీన్ షేక్స్ వంటి అనేక రకాల మందులను తీసుకుంటూ ఉంటారు. వీటి వల్ల ఎటువంటి చెడు ప్రభావం ఉండనప్పటికి ఉండదు. అయినప్పటికి ఇటువంటి అనేక రకాల మందులను తీసుకోవడానికి బదులుగా ఒకే ఒక పదార్థాన్నీ అది చిటికెడు మోతాదులో తీసుకుంటే చాలు అన్నీ రకాల అనారోగ్య సమస్యలు తగ్గు ముఖం పడతాయి. మన శరీరానికి మేలు చేసే పదార్థం మరేమిటో కాదు శిలాజిత్. దీనిని పూర్వకాలం నుండి వివిధ రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో, మానసిక శక్తిని పెంచడంలో ఉపయోగిస్తూ ఉన్నారు. కానీ ప్రస్తుత కాలంలో దీని గురించి మనలో చాలా మందికి తెలిసి ఉండదు. శిలాజిత్ ప్రకృతి పరంగా లభించే ఒక ఆయుర్వేద ఔషధం.
దీనిని ఉపయోగించడం వల్ల మనం ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. బరువు తగ్గడం నుండి మన శరీరంలో వివిధ అవయవాలకు వచ్చే అనారోగ్య సమస్యలను నయం చేయడం వరకు శిలాజిత్ మనకు ఉపయోగపడుతుంది. దీనిలో 85కు పైగా యాక్టివ్ న్యూట్రియన్స్ ఉంటాయి. 13 సంవత్సరాల పిల్లల నుండి పెద్ద వారి వరకు అందరూ దీనిని ఉపయోగించవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు, చర్మం మరియు జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడే వారు, తరచూ నీరసం, నిస్సత్తువులతో బాధపడే వారు శిలాజిత్ ను ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. శిలాజిత్ ను ఏయే వయసుల వారు ఎంత మోతాదులో తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ శిలాజిత్ ను చాలా మంది పర్వతాల జిగురు అని పిలుస్తారు. చెట్ల నుండి జిగురు ఎలా అయితే వస్తుందో పర్వతాల నుండి కూడా అలాగే వస్తుంది.

దీనిని సేకరించి శుద్ది చేసి గులికల రూపంలో లేదా పేస్ట్ రూపంలో అమ్ముతూ ఉంటారు. ఇది ఎక్కువగా హిమాలయ పర్వతాల్లోనే లభిస్తుంది. శిలాజిత్ యొక్క ఒక్క గుళిక మన శరీరంలోని ఏడు ధాతువుల పైన చక్కటి ప్రభావాన్ని చూపిస్తుంది. ద్రవరూపంలో ఉన్న శిలాజిత్ ను ఉపయోగించడం చాలా మంచిది. ఈ శిలాజిత్ ను పెద్ద వారు ఒక్కసారి 150 నుండి 250 మిల్లీ గ్రాముల మోతాదులో తీసుకోవాలి. అలాగే దీనిని ఒక్కరోజులో 600 మిల్లీ గ్రాముల కంటే ఎక్కువగా తీసుకోకూడదు. దీనిని గోరువెచ్చని నీటిలో లేదా పాలల్లోకలిపి తీసుకోవాలి. ఒక ఘన పదార్థంలో ఉండే శిలాజిత్ ను చాకుతో కట్ చేసుకుని రెండు బియ్యం గింజల మెతాదులో తీసుకుని మాత్రలుగా చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మాత్రలను మంచి నీటిలో లేదా పాలల్లోకలిపి తీసుకోవచ్చు. దీనిని ఉదయం అల్పాహారానికి అరగంట ముందు తీసుకోవడం మంచిది.
అలాగే దీనిని వేడి నీటిలో కలపకూడదు. గోరు వెచ్చని నీటిలో మాత్రమే కలపాలి. అయితే గర్భిణీ స్త్రీలు ఈ శిలాజిత్ ను ఉపయోగించకూడదు. అలాగే శరీరంలో ఐరన్ శాతం ఎక్కువగా ఉన్న వారు, గుండె జబ్బులు, అధిక రక్తపోటు సమస్యలతో బాధపడే వారు కూడా ఈ శిలాజిత్ ను తీసుకోకూడదు. అలాగే జ్వరం వంటి సమస్యల బారినపడినప్పుడు అవి తగ్గే వరకు దీనిని తీసుకోకూడదు. అలాగే హార్మోన్లకు సంబంధించిన మందులను వాడుతున్న వారు మందులు వేసుకున్న మూడు గంటల తరువాత లేదా మందులు వేసుకోవడానికి మూడు గంటల ముందు మాత్రమే దీనిని తీసుకోవాలి. ఈ శిలాజిత్ శరీరంలో వేడిని పెంచుతుంది. కనుక చలికాలంలో తీసుకోవడం మంచిది. అదే విధంగా వేసవి కాలంలో దీనిని రోజూ మార్చి రోజూ తీసుకోవాలి. అలాగే దీనిని వరుసగా మూడు నెలల కంటే ఎక్కువ రోజులు వాడకూడదు. 3 నెలలు వాడిన తరువాత ఒక నెల రోజులు ఆగి మరలా ఉపయోగించాలి. శిలాజిత్ ను తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి.
శరీరంపై ఉండే గాయాలు త్వరగా మానుతాయి. అలాగే శరీరం యొక్క శక్తిని పెంచడానికి కూడా ఈ శిలాజిత్ మనకు ఉపయోగపడుతుంది. వ్యాయామాలు ఎక్కువగా చేసే వారు, ఆటలు ఎక్కువగా ఆడే వారు శిలాజిత్ ను తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది. రక్తనాళాల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కరిగించడంలో, నరాల బలహీనత వంటి సమస్యలను తగ్గించడంలో, పురుషుల్లో వచ్చే లైంగిక సమస్యలను తగ్గించడంలో కూడా ఈ శిలాజిత్ మనకు ఉపయోగపడుతుంది. దీనిని వాడడం వల్ల చర్మం కూడా కాంతివంతంగా తయారవుతుంది. టైప్ 2 డయాబెటిస్ తో బాధపడే వారు దీనిని తీసుకోవడం వల్ల డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవచ్చు. అలాగే స్త్రీలు దీనిని తీసుకోవడం వల్ల వారిలో వచ్చే నెలసరి సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ విధంగా శిలాజిత్ మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని తగిన మోతాదులో వాడడం వల్ల మనం చక్కటి ఫలితాలను పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.