Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home మూలిక‌లు

Holy Basil : ఈ 11 ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు తుల‌సి ఆకుల‌ను ఇలా ఉప‌యోగించండి..!

Admin by Admin
April 6, 2022
in మూలిక‌లు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Holy Basil : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి తులసిని ఔషధ, పూజ మొక్కగా ఉపయోగిస్తున్నారు. తులసి ఆకులతో అనేక అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. ఆయుర్వేద ప్రకారం తులసిలో అనేక అద్భుతమైన ఔషధగుణాలు ఉంటాయి. అయితే ఏయే అనారోగ్యాలకు తులసి ఆకులను ఎలా వాడాలి ? అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

use Holy Basil leaves in this way for these 11 health problems
Holy Basil

1. చాలా మందిని అధిక కఫం సమస్య వేధిస్తుంటుంది. గొంతులో కఫం బాగా ఉండడం వల్ల సరిగ్గా మాట్లాడలేకపోతుంటారు. ఎక్కువ సేపు మాట్లిడితే దగ్గు వస్తుంది. కానీ తులసి ఆకులతో ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. అందుకు గాను రోజూ ఉదయాన్నే పరగడుపునే నాలుగు తులసి ఆకులను నోట్లో వేసుకుని నేరుగా అలాగే నమిలి మింగేయాలి. ఇలా రోజూ చేస్తుంటే శరీరంలో ఉన్న కఫం దెబ్బకు పోతుంది. ఊపిరితిత్తుల్లోని కఫం కూడా బయటకు వచ్చేస్తుంది.

2. జీర్ణాశయం, పేగుల్లో ఉండే సూక్ష్మ క్రిములను నాశనం చేసే శక్తి తులసి ఆకులకు ఉంటుంది. కనుక రోజూ ఉదయాన్నే పరగడుపునే నాలుగు తులసి ఆకులను నోట్లో వేసుకుని నమిలి మింగితే.. జీర్ణవ్యవస్థలో ఉండే క్రిములన్నీ నాశనం అవుతాయి. జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.

3. తులసి ఆకులను పరగడుపునే తినడం వల్ల రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే నాలుగైదు తులసి ఆకులను తీసుకుని మెత్తగా దంచి పేస్ట్‌లా చేయాలి. దాన్ని ఒక గుళిక (మాత్ర)గా తయారు చేసుకుని రోజూ ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు ఒక మాత్ర చొప్పున వేసుకోవాలి. దీంతో జీర్ణ సమస్యలు ఉండవు. గ్యాస్‌, మలబద్దకం, అజీర్ణం తగ్గుతాయి. అలాగే ఆకలి కూడా పెరుగుతుంది.

4. తులసి ఆకులను సేకరించి బాగా కడిగి శుభ్రం చేయాలి. అనంతరం వాటిని నీడలో ఎండబెట్టి పొడి చేయాలి. ఆ పొడిని కొద్దిగా తీసుకుని అందులో నీళ్లు కలిపి మెత్తని పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. దీంతో రోజూ దంతాలను తోముకోవాలి. ఇలా రోజూ చేస్తుంటే దంతాలపై ఉండే గార, పసుపు దనం పోతాయి. దంతాలు తెల్లగా మారి మెరుస్తాయి. అలాగే చిగుళ్ల నుంచి కారే రక్తస్రావం తగ్గుతుంది. చిగుళ్లు ఆరోగ్యంగా మారుతాయి. ఇన్‌ఫెక్షన్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. నోట్లో సూక్ష్మ క్రిములు చనిపోతాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది. నోరు, దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

5. దగ్గు, జలుబు, జ్వరం ఉన్నప్పుడు ఒక టీస్పూన్‌ తులసి ఆకుల రసంలో అంతే మోతాదులో తేనె కలిపి రోజుకు మూడు పూటలా తీసుకోవాలి. దీంతో ఆయా సమస్యల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.

6. నాలుగైదు తులసి ఆకులు, నాలుగైదు పుదీనా ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని రోజుకు రెండు సార్లు.. ఉదయం, సాయంత్రం.. ఒక కప్పు మోతాదులో తాగుతుండాలి. దీని వల్ల జ్వరం తగ్గుతుంది. శరీర ఉష్ణోగ్రత వెంటనే అదుపులోకి వస్తుంది.

7. తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని రోజుకు మూడు సార్లు.. పూటకు ఒక కప్పు చొప్పున తాగుతుండాలి. దీంతో గొంతు నొప్పి, దగ్గు తగ్గుతాయి.

8. ఉదయాన్నే ఒక టీస్పూన్‌ తేనె, అంతే మోతాదులో తులసి ఆకుల రసం కలిపి సేవిస్తుంటే.. గొంతు బొంగురు తగ్గుతుంది. మృదువైన కంఠ స్వరం వస్తుంది.

9. తులసి ఆకుల రసం, ఉల్లిపాయ రసం, అల్లం రసం, తేనెలను కలిపి ఈ మిశ్రమాన్ని ఆరు టీస్పూన్‌ల మోతాదులో రోజుకు రెండు సార్లు.. ఉదయం, సాయంత్రం.. తాగాలి. దీని వల్ల విరేచనాలు తగ్గుతాయి.

10, రాత్రి పూట ఒక గ్లాస్‌ పలుచని మజ్జిగలో కాస్త తులసి ఆకుల రసం వేసి బాగా కలిపి తీసుకోవాలి. రోజూ ఇలా చేస్తే శరీరంలోని కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.

11. రాత్రి పూట ఒక టీస్పూన్‌ తులసి ఆకుల రసంతోపాటు అంతే మోతాదులో చక్కెర లేదా తేనెను కలిపి తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు.

Tags: holy basilholy basil leaves
Previous Post

Multi Dal Dosa : వివిధ ర‌కాల ప‌ప్పులతో మ‌ల్టీ దాల్ దోశ‌ను ఇలా వేయండి.. ఎంతో ఆరోగ్య‌క‌రం..!

Next Post

Ayurvedic Buttermilk : మజ్జిగతో ఆయుర్వేద పానీయం.. రోజూ ఒక్క గ్లాస్‌ తాగితే చాలు..!

Related Posts

హెల్త్ టిప్స్

ఏ సీజ‌న్‌లో అయినా స‌రే కొబ్బ‌రి నీళ్ల‌ను రోజూ తాగాల్సిందే.. ఎందుకంటే..?

June 1, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మీరు పోష‌కాహార లోపంతో బాధ‌ప‌డుతున్నారా.. అయితే గుండె పోటు వ‌స్తుంద‌ట‌..

June 1, 2025
వైద్య విజ్ఞానం

ఈ ఆహారాల‌ను మీరు క‌డుపు నిండా తిన‌వ‌చ్చు.. కానీ బ‌రువు మాత్రం పెర‌గ‌రు..

June 1, 2025
వినోదం

స్కూల్ ఫీజ్ క‌ట్ట‌లేక…కార్పెంట‌ర్ ప‌నిలో చేరిన దాస‌రి ! ద‌ర్శ‌క‌ర‌త్న గురించి మ‌న‌కు తెలియ‌ని కోణం.!!

June 1, 2025
information

ఎస్‌బీఐ లోగోను అలా ఎందుకు డిజైన్ చేశారో తెలుసా.? వెనకున్న కారణం, దాగున్న అర్థం ఇదే..!

June 1, 2025
ఆధ్యాత్మికం

ఏయే దానాలు చేయ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయంటే..? అద్భుత‌మైన స‌మాచారం మీ కోసం..

June 1, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!