Giloy : మన చుట్టూ ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు ఉన్నాయి. వాటిల్లో ఔషధగుణాలు ఉండే మొక్కలు కూడా చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో తిప్పతీగ ఒకటి. ఇది మనకు విరివిగా లభిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తిప్పతీగ మనకు ఎక్కువగా లభిస్తుంది. సులభంగా దొరుకుతుంది. అయితే తిప్పతీగ రసాన్ని రోజూ సేవిస్తే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో షుగర్ లెవల్స్ తగ్గడమే కాదు.. రోగ నిరోధక శక్తి కూడా అద్భుతంగా పెరుగుతుంది. అయితే తిప్పతీగను తీసుకోవాలనుకునేవారు కింద తెలిపిన విషయాలను ఒకసారి కచ్చితంగా తెలుసుకోవాలి. అవేమిటంటే..
తిప్పతీగను రోజూ ఉదయాన్నే పరగడుపునే తీసుకోవాలి. 2 టీస్పూన్లకు మించి దీన్ని తీసుకోరాదు. 2 టీస్పూన్ల తిప్పతీగ రసానికి అంతే మోతాదులో నీరు కలిపి తాగాలి. మోతాదుకు మించితే తీవ్ర దుష్పరిణామాలు కలుగుతాయి.
రాత్రి పూట కూడా తిప్పతీగను తీసుకోవచ్చు. కానీ దాన్ని భోజనం చేసిన తరువాతే తీసుకోవాలి. అది కూడా చూర్ణం రూపంలో తీసుకోవాలి. రాత్రి భోజనం అనంతరం పావు టీస్పూన్ తిప్ప తీగ చూర్ణానికి 1 టీస్పూన్ తేనె కలిపి తీసుకోవాలి. ఇంతకు మించి మోతాదులో చూర్ణాన్ని తీసుకోరాదు. అధికంగా సేవిస్తే అనారోగ్య సమస్యలు వస్తాయి.
ఇక షుగర్ ఉన్నవారు అర టీస్పూన్ తిప్పతీగ రసాన్ని రోజూ ఉదయం, సాయంత్రం భోజనం అనంతరం తీసుకోవాలి. కొలెస్ట్రాల్ లెవల్స్ అధికంగా ఉన్నవారు. ఉదయాన్నే పరగడుపునే ఒక గ్లాస్ నీటిలో 2 టీస్పూన్ల తిప్పతీగ రసాన్ని బాగా కలిపి తాగాలి. మోతాదుకు మించరాదు.
శస్త్ర చికిత్స చేయించుకున్నవారు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, చిన్నారులు దీన్ని వాడరాదు. ఇక ఇది మనకు ట్యాబ్లెట్ రూపంలోనూ లభిస్తుంది. దీన్ని రోజుకు 2 సార్లు 1 నుంచి 2 ట్యాబ్లెట్లు వేసుకోవచ్చు. దీన్ని డాక్టర్ పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది.