Egg Face Pack : ఒక చక్కటి చిట్కాను ఉపయోగించి మనం చాలా సులభంగా మన ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు.ఈ చిట్కాను ఉపయోగించడం వల్ల చర్మంపై ఉండే ముడతలను, మచ్చలను, నలుపును చాలా సులభంగా తొలగించుకోవచ్చు. ప్రస్తుత కాలంలో చాలా మంది మచ్చలు, మొటిమలు, ముడతలు వంటి వివిధ రకాల చర్మ సమస్యలతో బాధపడుతున్నారు. వాతావరణ కాలుష్యం, మనం తీసుకునే ఆహారమే ఈ సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. శరీరంపై ఉండే చర్మం కంటే ముఖంపై ఉండే చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. ముఖ చర్మంపై దుమ్ము, ధూళి, మృతకణాలు త్వరగా పేరుకుపోతాయి. దీంతో మొటిమలు వంటి సమస్యలు తలెత్తుతాయి.
అలాగే సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల వృద్ధాప్య ఛాయలు త్వరగా వస్తాయి. ఇటువంటి సమస్యలతో బాధపడే వారు ఎగ్ ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకుని వాడడం వల్ల అందమైన ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ ప్యాక్ ను ఉపయోగించడం వల్ల చర్మ సమస్యలన్నీ తొలగిపోయి ముఖం అందంగా కనబడుతుంది. ముఖంపై నలుపును, ముడతలను, మచ్చలను తగ్గించే ఈ ఎగ్ ఫేస్ ప్యాక్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకోవడానికి గానూ ముందుగా ఒక గిన్నెలో అర చెక్క నిమ్మరసాన్ని, ఒక టీ స్పూన్ పంచదారను తీసుకుని కలపాలి. తరువాత ఇందులో కోడిగుడ్డు తెల్లసొనను వేసి కలపాలి. తరువాత ఇందులో ఒకటి లేదా రెండు టీ స్పూన్ల శనగపిండిని వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎగ్ ఫేస్ ప్యాక్ తయారవుతుంది. ఈ ఫేస్ ప్యాక్ ను ఉపయోగించే ముందు ముఖాన్ని శుభ్రంగా కడగాలి.
తరువాత ఈ ఫేస్ ప్యాక్ ను ముఖానికి రాసుకోవాలి. ఒకసారి రాసుకున్న కోడిగుడ్డు మిశ్రమం ఆరిన తరువాత దానిపై మరోసారి అదే మిశ్రమాన్ని రాసుకోవాలి. అనగా మనం రెండుసార్లు ఈ మిశ్రమాన్ని రాసుకోవాలి. రెండు సార్లు రాసుకున్న మిశ్రమం ఆరిన తరువాత సాధారణ నీటితో కడిగి వేయాలి. అయితే ఈ ఫేస్ ప్యాక్ ను ముఖానికి రాసుకున్న సమయంలో మాట్లాడకుండా ఉండాలి. ఈ విధంగా ఈ ఫేస్ ప్యాక్ ను వారానికి రెండు సార్లు ఉపయోగించడం వల్ల మనం చాలా సులభంగా ముఖాన్ని అందంగా, కాంతివంతంగా మార్చుకోవచ్చు. ఈ చిట్కాను ఉపయోగించడం వల్ల ముఖం పై పేరుకుపోయిన దుమ్ము, ధూళి, మృతకణాలు తొలగిపోతాయి. అలాగే చర్మానికి కావల్సిన పోషకాలు అందడం వల్ల ముఖంపై ఉండే ముడతలు తొలగిపోతాయి. ముఖంపై ఉండే నలుపు తొలగిపోయి చర్మం అందంగా, మృదువుగా తయారవుతుంది.