Beauty Tips : మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, వావావరణ కాలుష్యం వంటి తదితర కారణాల వల్ల మనం తరచూ చర్మ సంబంధిత సమస్యల బారిన పడుతున్నాం. మొటిమలు, మచ్చలు, పిగ్మెంటేషన్ వంటి తదితర చర్మ సంబంధిత సమస్యలతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతోంది. ఈ మొటిమల కారణంగా చర్మంపై గుంతలు పడే అవకాశం కూడా ఉంటుంది. దీంతో ముఖం అందవిహీనంగా కనబడుతుంది. ఈ సమస్యలన్నింటినీ కూడా సహజసిద్ధంగా ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా నయం చేసుకోవడమే కాకుండా ముఖాన్ని కూడా అందంగా మార్చుకోవచ్చు.
మొటిమలు, మచ్చలను తగ్గించి చర్మాన్ని అందంగా కాంతివంతంగా మార్చే ఇంటి చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖాన్ని అందంగా మార్చుకోవడానికి గాను మనం 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని, పావు టీ స్పూన్ పసుపును, 3 టేబుల్ స్పూన్ల గులాబీ నీటిని, 2 నుండి 3 చుక్కల డెటాల్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో శనగ పిండిని, పసుపును, గులాబీ నీటిని వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. తరువాత 2 చుక్కల డెటాల్ ను వేసి కలపాలి.
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవడానికి ముందు ముఖాన్ని గోరు వెచ్చని నీటితో శుభ్రంగా కడగాలి. తరువాత చేత్తో కానీ, బ్రష్ తో కానీ ఈ మిశ్రమాన్ని తీసుకుంటూ ఫేస్ ప్యాక్ లా వేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ పూర్తిగా ఆరిన తరువాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కాను వారానికి రెండుసార్లు పాటించడం వల్ల ముఖంపై మొటిమలు, మచ్చలు, పిగ్మెంటేషన్ వంటి సమస్యలు తగ్గుతాయి. ముఖంపై ఉండే జిడ్డు తొలగిపోయి మొటిమలు రాకుండా ఉంటాయి. చర్మంపై ఉండే మృతకణాలు తొలగిపోయి ముఖం అందంగా.. కాంతివంతంగా తయారవుతుంది.