Cheeks : మనం అందంగా కనబడాలంటే మన ముఖం అందంగా, ఆకర్షణీయంగా కనబడాలి. మన ముఖంలో ప్రతి భాగం సరిగ్గా ఉంటేనే మనం అందంగా కనబడతాం. మన ముఖానికి అందాన్ని ఇచ్చే వాటిల్లో బుగ్గలు కూడా ఒకటి. కానీ కొందరిలో ఈ బుగ్గలు పీక్కుపోయి ఉంటాయి. దీంతో వారు నీరసంగా ఉన్నట్టు, అనారోగ్యాల బారిన పడినట్టు, అందవిహీనంగా, ముఖంలో కళ లేనట్టు కనబడతారు. ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కొందరిలో ఈ బుగ్గలు పీక్కుపోయినట్టు కనబడతాయి.
మనం తీసుకునే ఆహారం, మన జీవన శైలి, మనం చేసే వ్యాయామాలపైనే మన ముఖం అందం కూడా ఆధారపడి ఉంటుంది. ఇంటి చిట్కాను ఉపయోగించి పీక్కుపోయిన బుగ్గలను పెంచి ముఖం అందంగా, గుండ్రంగా కనబడేలా చేసుకోవచ్చు. ఆరోగ్యంగా ఉన్నప్పటికీ బుగ్గలు పీక్కుపోయినట్టు ఉన్న వారు ఈ చిట్కాను పాటించడం వల్ల చక్కని ఫలితం ఉంటుంది. ఈ చిట్కాను తయారు చేసుకోవడనాకి ముందుగా ఒక గిన్నెలో ఒకటి లేదా ఒకటిన్నర టీ స్పూన్ మెంతుల పొడిని తీసుకోవాలి. తరువాత తగినన్ని గోరు వెచ్చని నీటిని పోస్తూ ఉండలు లేకుండా పేస్ట్ లా చేసుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని బుగ్గలపై రాసి 20 నుండి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత ముఖాన్ని నీటితో కడిగేయాలి. ఈ చిట్కాను రోజుకు రెండు పూటలా పది రోజుల పాటు పాటించాలి. ఈ చిట్కాను పాటిస్తూనే ముఖానికి సంబంధించిన వ్యాయామాలను చేయడం వల్ల మరింత చక్కటి ఫలితం ఉంటుంది. ఈ చిట్కాను పాటించడం వల్ల పీక్కుపోయిన బుగ్గలు పెరగడంతో బుగ్గలు సహజ సిద్దంగా కాంతివంతంగా తయారవుతాయి. మెంతుల్లో ఉండే ఔషధ గుణాలు బుగ్గలు పెరిగి అందంగా కనబడేలా చేయడంలో సహాయపడతాయి. ఈ విధంగా ఈ చిట్కాను క్రమం తప్పకుండా పాటించడం వల్ల బుగ్గలు గుండ్రంగా, అందంగా కనబడతాయి.