Glowing Skin Tonic : ఎవరైనా సరే చర్మం ఆరోగ్యంగా ఉండాలని, ముఖం కాంతివంతంగా కనిపించాలనే కోరుకుంటారు. అయితే కొందరికి చర్మం డల్ గా ఉంటుంది. పొడిగా కూడా మారుతుంది. అలాగే కొందరికి మొటిమలు, మచ్చలు వస్తుంటాయి. ఇందుకు ఆహారం లేదా అస్తవ్యస్తమైన జీవన విధానం, గాలి కాలుష్య వంటివి కారణాలు అయి ఉంటాయి. ఈ క్రమంలోనే కొందరు క్రీములు గట్రా రాస్తుంటారు. అలాగే డైట్ విషయంలోనూ జాగ్రత్తలను పాటిస్తుంటారు. కానీ అనుకున్న ఫలితాలను రాబట్టలేకపోతుంటారు. అయితే ఇప్పుడు చెప్పబోయే ఒక డ్రింక్‌ను తయారు చేసి తాగితే చాలు.. ఇక ఏ క్రీములు, లోషన్లు రాయాల్సిన పనిలేదు.
డల్‌గా ఉన్న మీ చర్మం కాస్తా తాజాగా మారుతుంది. ముఖంలో కాంతి పెరుగుతుంది. మరి అందుకు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇందుకు గాను మీరు 4 పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. అవేమిటంటే.. నల్ల కిస్మిస్, కుంకుమ పువ్వు, గోండ్ కటిరా (మార్కెట్‌లో లభిస్తుంది), సబ్జా విత్తనాలు. ఈ నాలుగు పదార్థాలను రాత్రి పూట విడి విడిగా నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం అన్నింటినీ కలిపి ఒక జార్‌లోకి తీసుకుని బ్లెండ్ చేయాలి. అనంతరం వచ్చే డ్రింక్‌ను ఒక గ్లాస్ మోతాదులో తీసుకుని అందులో అవసరం అనుకుంటే ఐస్ క్యూబ్స్ వేసి తాగవచ్చు. దీన్ని ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేశాక తీసుకోవాలి.

ఇలా ఈ డ్రింక్‌ను మీరు రోజూ తాగితే కేవలం వారం రోజుల్లోనే మీరు స్పష్టమైన మార్పును గమనిస్తారు. మీ ముఖం డల్ నుంచి తాజాగా మారుతుంది. ముఖంలో కాంతి పెరుగుతుంది. చర్మం మృదువుగా మారుతుంది. అయితే ఈ డ్రింక్‌ను ట్రై చేసినా ఎలాంటి ఫలితం లేకపోతే అప్పుడు మీరు డాక్టర్‌ను సంప్రదించాల్సిందే. ఎందుకంటే సహజ పద్ధతులు పనిచేయకపోతే అప్పుడు వైద్యులను ఆశ్రయిస్తే తగిన ఫలితం కనిపిస్తుంది.