శరీరంలో అనేక భాగాల్లో సాధారణంగా చాలా మందికి నల్లగా అవుతుంటుంది. ఆయా భాగాల్లో చర్మం నల్లగా మారడంతో ఇబ్బందులు పడుతుంటారు. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. ఎక్కువగా ఎండలో తిరగడం వల్ల ఈ సమస్య వస్తుంది. అయితే కొందరికి మెలనిన్ ఎక్కువగా ఉత్పత్తి అయినా ఈ విధంగా జరుగుతుంటుంది.
చాలా మందికి మెడ భాగంలో నల్లగా అవుతుంది. అలాంటి వారు దిగులు చెందాల్సిన పనిలేదు. కింద తెలిపే చిట్కాను వాడితే మెడ భాగాన్ని తెల్లగా మార్చుకోవచ్చు. అక్కడ ఉండే నలుపుదనం పోతుంది. చర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది.
2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, అంతే మోతాదులో శనగపిండి, పెరుగులను తీసుకోవాలి. శనగపిండి వద్దనుకుంటే గోధుమ పిండిని కూడా వాడవచ్చు. అలాగే చిటికెడు పసుపు, 1 టీస్పూన్ బంగాళా దుంప జ్యూస్ ను కూడా తీసుకోవాలి.
ఇప్పుడు అన్నింటినీ బాగా కలిపి పేస్ట్‌లా చేయాలి. దీన్ని మెడ ముందు, వెనుక భాగాల్లో చేత్తో లేదా బ్రష్‌తో రాయాలి. తరువాత 15-20 నిమిషాల పాటు ఉంటే ఆ ప్యాక్ అంతా ఆరిపోతుంది. అనంతరం చేతిని నీటిలో తడిపి దాంతో మెడ ముందు, వెనుక భాగాల్లో సున్నితంగా, వృత్తాకారంలో మసాజ్ చేయాలి. తరువాత చల్లని నీటితో కడిగేయాలి.
ఇలా వారంలో 2 సార్లు చేయాలి. దీంతో మెడపై ఉండే నలుపు పోతుంది. మెడ పూర్వ స్థితిని పొందుతుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది.