Drumstick Seeds : ప్రస్తుత కాలంలో మద్యానికి బానిసయ్యే వారు రోజురోజుకూ ఎక్కువవుతున్నారు. సరదా కోసం అలవాటు చేసుకున్న ఈ వ్యసనం జీవితాలనే నాశనం చేసే దాక వెళ్తోంది. మానసిక ఒత్తిడిని, ఆందోళనలను తట్టుకోలేక మద్యం తాగే వారు కొందరు, పార్టీ అని తాగే వారు కొందరు, సరదాకి తాగే వారు కొందరు.. ఇలా ఏదో ఒక రకంగా మద్యాన్ని తాగుతూనే ఉంటున్నారు. ఈ మద్యాన్ని ఎప్పుడో ఒకసారి తాగడం వల్ల ఆరోగ్యానికి ఎటువంటి హాని కలగదు. కానీ కొందరు దీనికి బాగా అలవాటు పడి రోజూ మద్యం తాగకుండా ఉండలేకపోతున్నారు. కష్టపడి సంపాదించిన డబ్బునంతా మద్యం తాగడానికే ఖర్చు చేస్తున్నారు. మద్యం సేవించి ఇంట్లో వారితో, ఇతరులతో గొడవ పడడం వంటివి చేస్తున్నారు.
ఒక్కోసారి మద్యం సేవించడానికి డబ్బులు లేక ఇంట్లో ఉండే వస్తువులను కూడా అమ్మేస్తూ ఉంటారు. ఇలా ప్రతి రోజూ మద్యం తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తోంది. కాలేయం, మూత్ర పిండాల సమస్యలతోపాటు ఇతర అనారోగ్య సమస్యల బారిన కూడా పడాల్సి వస్తోంది. ఇలా ప్రతిరోజూ విపరీతంగా తాగే అలవాటు ఉన్న వారి ఇల్లు కూడా ఏవిధంగానూ అభివృద్ధి చెందదు. ఈ మధ్య కాలంలో యువతీ యువకులు కూడా ఈ మద్యానికి అలవాటు పడి తల్లిదండ్రుల మాట వినకపోవడం, చదువును నిర్లక్ష్యం చేయడం వంటివి చేస్తున్నారు.
మద్యం తాగేవారిని ఆ అలవాటు నుండి బయటపడేయడానికి ఇంట్లోని వారు చేయని ప్రయత్నం అంటూ ఉండదు. మనకు మార్కెట్ లో కూడా ఈ అలవాటును తగ్గించే పౌడర్ లు, టానిక్ లు లభిస్తాయి. కానీ వాటిని వాడడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండడం లేదు. ఈ మద్యం తాగే అలవాటును తగ్గించే మార్గాలు ఆయుర్వేదంలో కూడా ఉన్నాయి. ఈ అలవాటును మానేలా చేయడంలో మునగ చెట్టు మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మునగ చెట్టులో ప్రతి భాగం ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుందని మనందరికీ తెలుసు. అలాగే మునగ చెట్టు గింజలు కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి.
మద్యం తాగే అలవాటు తగ్గేలా చేయడంలో మునగ చెట్టు గింజలు మనకు ఎంతో సహాయపడతాయి. బాగా ఎండిన మునక్కాయల్లో ఉండే గింజలను తీసుకుని పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. మద్యం తాగే వారికి వారు మద్యం తాగిన తరువాత ఈ పొడిని కొద్ది మోతాదులో నీటిలో కలిపి తాగించాలి లేదా వారిని ఈ మునగ గింజలను నోట్లో వేసుకుని చప్పరించమనాలి. ఇలా మద్యం తాగిన వారిచే చేయించడం వల్ల వారు క్రమక్రమంగా మద్యం తాగే అలవాటు నుండి బయటపడతారు. ఈ విధంగా మునగ చెట్టు గింజలు ఈ అలవాటు నుండి బయటపడడంలో మనకు ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.