Eye Sight : ప్రస్తుత కాలంలో సెల్ ఫోన్ ల వాడకం ఎక్కువైయ్యింది. రాత్రి పగలు అనే తేడా లేకుండా వీటిని ఉపయోగిస్తున్నారు. దీంతో చాలా మంది కంటి సంబంధిత సమస్యల బారిన పడుతున్నారు. అలాగే పోషకాహార లోపం కారణంగా చాలా మందిలో కంటి చూపు మందగించడంతో పాటు ఇతర కంటి సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి. కంటి చూపు మందగించడంతో చాలా మంది అద్దాలను ఉపయోగిస్తూ ఉంటారు. కళ్లద్దాలను ఉపయోగించే పని లేకుండా మన ఇంట్లోనే ఒక పొడిని తయారు చేసుకుని వాడడం వల్ల మనం చాలా సులభంగా కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
కంటిచూపును మెరుగుపరిచే ఈ పొడిని ఎలా తయారు చేసుకోవాలి..తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి…అలాగే ఈ పొడిని ఎలా ఉపయోగించాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పొడిని తయారు చేసుకోవడానికి గానూ 25 గ్రా. బాదం పప్పును, 50 గ్రా. పుచ్చకాయ గింజలను, 50 గ్రా. పటిక బెల్లాన్ని, 10 నల్ల మిరియాలను, 50 గ్రా. సోంపు గింజలను, 50 గ్రా. ధనియాలను ఉపయోగించాల్సి ఉంటుంది. ఇప్పుడు వీటన్నింటిని ఒక జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గాలి తగలకుండా నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని రోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ ఆవు పాలల్లో కలిపి తాగాలి. పాలు తాగడం ఇష్టంలేని వారు ఒక రాగి గ్లాస్ లో నీటిని పోసి రాత్రంతా అలాగే ఉంచాలి.

ఉదయాన్నే ఈ నీటిలో ఒక టీ స్పూన్ మోతాదులో ముందుగా తయారు చేసుకున్న పొడిని వేసి కలిపి తాగాలి. ఇలా తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. దీనిని పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా తీసుకోవచ్చు. ఈ విధంగా పొడిని తీసుకుంటూనే నాటు ఆవు నెయ్యిని రోజూ రాత్రి పడుకునే ముందు కాళ్లకు రాసుకోవాలి. అలాగే గడ్డి మీద చెప్పులు లేకుండా నడవాలి. ఇలా చేయడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. శరీరానికి అవసరమయ్యే పోషకాలు లభిస్తాయి. పోషకాహార లోపం తలెత్తకుండా ఉంటుంది. కంటిచూపు మెరుగుపడడంతో పాటు కంటికి సంబంధించిన ఇతర సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ విధంగా మన ఇంట్లోనే చక్కటి పొడిని తయారు చేసుకుని వాడడం వల్ల కంటి చూపును పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.