చిట్కాలు

ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని చిట్కాలు..!

మీరు చిగుళ్ల నొప్పి, నిద్రలేమి, మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారా.. అయితే ఈ చిట్కాలు పాటించండి. చిగుళ్లు, పళ్లకు సంబంధించిన అనారోగ్యం ఉంటే నువ్వులనూనెలో లవంగ నూనె కలిపి వేలితో చిగుళ్ల మీద రుద్దాలి. ప్రతిరోజూ ఉదయాన్నే ఇలా మర్దన చేస్తుంటే చిగుళ్లు గట్టిపడతాయి. నిద్రలేమితో బాధపడుతుంటే పడుకోబోయే ముందు పదిహేను నిమిషాల సేపుపాదాలను, అరిపాదాలను నెయ్యి లేదా ఆముదంతో మర్దన చేయాలి.

మానసిక రుగ్మత ఉన్న వాళ్లకు నువ్వుల నూనెతో కాని నెయ్యితో కాని తలకు నుదుటి మీద మర్దన చేయాలి. రాత్రి పూట మర్దన చేసి ఉదయాన్నే తలస్నానం చేయాలి.

follow these tips for your health

నాలుగైదు బాదం పప్పులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటే మెదడు వికాసం పొందుతుంది. డయేరియా ఉన్నప్పుడు మజ్జిగ, పండ్ల రసం, కొబ్బరినీళ్లు, మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. కూల్‌డ్రింకులు మాత్రం తీసుకోకూడదు.

Admin

Recent Posts