Cough : వాతావరణ మార్పుల కారణంగా మనకు వచ్చే అనారోగ్య సమస్యల్లో దగ్గు కూడా ఒకటి. వర్షాకాలంలో, శీతాకాలంలో ఈ సమస్య మనల్ని అధికంగా వేధిస్తుంది. దగ్గు సమస్య చిన్నదే అయినప్పటికీ దీని కారణంగా మనకు చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఎన్ని రకాల సిరప్ లు, యాంటీ బ్యాక్టీరియల్ మందులను వాడినప్పటికీ ఫలితం లేక బాధపడే వారు మనలో చాలా మంది ఉండి ఉంటారు. ఎంతటి భయంకరమైన దగ్గునైనా ఒక రోజులో తగ్గించే ఆయుర్వేద చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దగ్గును తగ్గించడంలో మనకు వెలిగారం ఎంతో ఉపయోగపడుతుంది. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.
ఆయుర్వేదంలో కూడా దీనిని విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటారు. దీనిని సంస్కృతంలో టంకణం అని, హిందీలో సుగాహా అని, ఆంగ్లంలో బోరాక్స్ అని పిలుస్తారు. ఆయుర్వేద షాపుల్లో ఇది మనకు చాలా తక్కువ ధరల్లోనే దొరుకుతుంది. దగ్గుతో బాధపడే వారు స్ఫటిక రూపంలో ఉండే ఒక చిన్న ముక్క వెలిగారాన్ని తీసుకుని ఇనుప పెనం మీద ఉంచి చిన్న మంటపై వేడి చేయాలి. ఈ వెలిగారం ముక్క కరిగి అందులో ఉన్న నీరు అంతా పోయిన తరువాత ఈ వెలిగారం గట్టిగా మారుతుంది. ఇలా గట్టిగా మారగానే స్టవ్ ఆఫ్ చేసి పప్పు గుత్తిని తీసుకుని ఈ వెలిగారాన్ని మెత్తగా పొడిగా చేసుకోవాలి. ఈ పొడిగా చేసుకున్న వెలిగారం పొడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న వెలిగారం పొడిని పావు టీ స్పూన్ మోతాదులో తీసుకుని దానికి రెండు టీ స్పూన్ల స్వచ్ఛమైన తేనెను కలపాలి.
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని రోజూ రాత్రి పడుకునే ముందు తీసుకోవాలి లేదా దగ్గు ఎక్కువగా ఉన్న సమయంలోనైనా తీసుకోవచ్చు. ఈ వెలిగారం పొడిని పెద్దలకు పావు టీ స్పూన్ మోతాదులో పిల్లలకు రెండు చిటికెల మోతాదులో మాత్రమే ఇవ్వాలి. ఈ విధంగా వెలిగారం మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల ఎన్నో రోజుల నుండి బాధిస్తున్న దగ్గు అయినా సరే చాలా త్వరగా తగ్గిపోతుంది. అంతేకాకుండా ఈ వెలిగారాన్ని తేనెతో కలిపి తీసుకోవడం వల్ల జలుబు, గొంతునొప్పి, నోటిపూత వంటి ఇతర సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ వెలిగారం పొడిని తేనెతోనే కాకుండా గోరు వెచ్చని నీటిలో కూడా కలిపి తీసుకోవచ్చు. దగ్గుతో బాధపడే వారు ఈ చిట్కాను పాటించడం వల్ల దగ్గు నుండి సత్వరమే ఉపశమనం కలుగుతుంది.