How To Clean Arteries : నేటి తరుణంలో చాలా మంది అధిక కొలెస్ట్రాల్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. చెడు ఆహారపు అలవాట్లు, నిద్ర సరిగ్గా పోకపోవడం, శారీరక శ్రమ చేయకపోవడం, జంక్ ఫుడ్‌ను ఎక్కువగా తినడం, రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం, పొగ తాగడం, మద్యం సేవించడం.. వంటి కారణాల వల్ల యువతలోనూ కొలెస్ట్రాల్ లెవల్స్ ఎక్కువగా పేరుకుపోతున్నాయి. దీంతో రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడి రక్తసరఫరాకు ఆటంకం కలుగుతుంది. ఫలితంగా హార్ట్ ఎటాక్ వస్తోంది.
అందుకనే చాలా మంది ఈ రోజుల్లో చిన్న వయస్సులో ఉన్నవారు సైతం హార్ట్ ఎటాక్ బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్య రాకుండా ఉండాలంటే మన రోజువారీ దినచర్యలో చిన్న మార్పు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఉదయం పరగడుపునే నీళ్లలో ఒక పదార్థాన్ని కలిపి తాగితే దాంతో రక్తనాళాలు కడిగేసినట్లు క్లీన్ అవుతాయి. రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. శరీరంలోని కొలెస్ట్రాల్ మంచులా కరిగిపోతుంది. ఇక అందుకు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
కొలెస్ట్రాల్ తగ్గుతుంది..
మనం వెల్లుల్లిని రోజూ వంటల్లో వాడుతుంటాం. అయితే ఇది అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించగలదు. హార్ట్ ఎటాక్ రాకుండా చేస్తుంది. కనుక వెల్లుల్లిని రోజూ తీసుకోవాలి. వెల్లుల్లిలో అనేక యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించడంలో సహాయం చేస్తాయి. వెల్లుల్లిని తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్‌ను గణనీయంగా తగ్గించుకోవచ్చు. వెల్లుల్లిలో ఆల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్)ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్)ను పెంచుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
వెల్లుల్లిలో ఉండే సమ్మేళనాలు రక్త సరఫరాను పెంచుతాయి. దీంతో రక్తనాళాల్లో ఉండే కొవ్వు కరిగిపోతుంది. ఫలితంగా గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపించడంలోనూ వెల్లుల్లి ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఈ ప్రయోజనాలను పొందాలంటే వెల్లుల్లిని రోజూ ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వెల్లుల్లిని ఇలా తీసుకోవాలి..
రోజూ ఉదయాన్నే పరగడుపునే 2 వెల్లుల్లి రెబ్బలను నేరుగా అలాగే నమిలి తినవచ్చు. లేదా వాటిని మెత్తగా దంచి ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి తాగవచ్చు. ఇలా ఏ రకంగా వెల్లుల్లిని తీసుకున్నా కూడా ఆరోగ్యకరమైన ప్రయోజనాలే కలుగుతాయి. ముఖ్యంగా హైబీపీ, అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నవారు ఇలా వెల్లుల్లిని గనక రోజూ తీసుకున్నట్లయితే దీంతో ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు.