Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home చిట్కాలు

ఈ టిప్స్ కేవ‌లం అమ్మాయిల‌కే కాదు.. అబ్బాయిల అందానికి కూడా..!

Admin by Admin
January 26, 2025
in చిట్కాలు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

అందం అనగానే అమ్మాయిలే గుర్తుకువస్తారు. ఏం అబ్బాయిలు అందంగా ఉండకూడదా? అందం మహిళలకే సొంతమా? ఏ పత్రికలు, వీడియోలు చూసినా అమ్మాయిలు మాత్రమే అందం విషయంలో చిట్కాలు ఉంటాయి. అబ్బాయిల గురించి తెలుసుకోవాలంటే కొంచెం కష్టమే. మరేం బెంగపడవద్దు. అబ్బాయిలు అందం విషయంలో ఎలాంటి విషయాలు తీసుకోవాలో ఈ కింది చిట్కాలు చదవండి.

నిమ్మ మరియు తేనె : నిమ్మరసంలో దుమ్ము ధూలిని వదిలించి శుద్ది చేసే గుణం కలిగుంటుంది. ఇంట్లో ఫేస్‌వాస్‌కు బదులుగా నిమ్మరసం ఉపయోగించడం మంచిది. తేనె, నిమ్మరసాన్ని బాగా కలుపాలి. తేనె చర్మాన్ని తేమగా ఉంచుతుంది. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని 15 నిమిషాల తర్వాత శుభ్రపరుచుకుంటే ముఖం అందంగా మారుతుంది. తేనె మరియు కాఫీ : తేనె, కాఫీపొడి, కొన్ని చుక్కల ఆలివ్‌ ఆయిల్‌ తీసుకొని బాగా కలుపాలి. ఈ పదార్థాలను బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకుంటే చర్మంపై చనిపోయిన చర్మకణాలను తొలిగిస్తుంది. దీంతో చర్మం తాజాగా, మృదువుగా కనిపిస్తుంది.

men follow these beauty tips for skin glow

బాదం, గంధం మరియు వేప : వేపాకు తీసుకువచ్చి పేస్ట్‌ చేయాలి. అందులో గంధపు పొడి, బాదం పొడి, పసుపు పొడి వేసి బాగా కలుపాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి ఐప్లె చేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. దీంతో ముఖం ప్రకాశవంతంగా తాజాగా కనిపిస్తుంది. ఆరెంజ్‌ జ్యూస్‌ మరియు పసుపు పేస్ట్‌ : ఆరెంజ్‌లో పుష్కలమైన విటమిన్లు అందుబాటులో ఉంటాయి. ఇది చర్మం రంగును మెరుగుపరుస్తుంది. నారింజ రసంలో చిటికెడు పసుపు కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని 20 నిమిషాల తర్వాత నీటితో శుభ్రపరుచుకుంటే సరిపోతుంది. ఈ పద్ధతి క్రమం తప్పకుండా పాటించాలి. బొప్పాయి మాస్క్‌ : బొప్పాయి శరీరానికి వేడి చేసే పదార్థం. అయినప్పటి ప్రొటీన్లు కలిగి ఉంటుంది. ఆకుపచ్చ బొప్పాయి చర్మానికి మేలు చేస్తుంది. చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్‌ చేయడానికి సహాయపడే ఎంజైమ్‌ అయిన పాపైన్‌ ఎక్కువ ఉంటుంది. బొప్పాయి పేస్ట్‌తో ముఖం మృదువుగా తయారవుతుంది.

ఇలా ఆలుగడ్డలు, టమాటాలు, ఓట్స్‌ అన్నింటితో విడివిడా ఫేస్‌మాస్క్‌ వేసుకుంటే మంచి ఫలితాలుంటాయి. దేన్నైనా ఒకదాన్ని ఫాలో అయితే మంచిది. ముఖం సబ్బుతో కడుక్కునేదానికంటే ఫేస్‌స్క్రబ్‌లు వాడడం మంచిది. దీనివల్ల చర్మంలో డెడ్‌స్కిన్‌ తొలిగిపోతాయి. పురుషులు వాడేందుకు లెక్కలేనన్ని స్క్రబ్‌లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. సాలిసిలిక్‌ ఆమ్లం, ఫ్రూట్‌ ఎంజైమ్‌లు, సిట్రిక్‌ యాసిడ్‌ మరియు ైగ్లెకోలిక్‌ ఆమ్లం కలిగిన స్క్రబ్‌లను ఎంచుకుంటే మంచిది. ఎన్ని మాస్క్‌లు, స్క్రబ్‌లు వాడినా ఒత్తిడి ఎక్కువగా ఉంటే ఏవీ పనికిరావు. కాబట్టి వీలైనంత వరకు ఒత్తిడికి గురికాకుండా చూసుకోండి. ఎల్లప్పుడూ నవ్వుతూ పక్కవారిని నవ్విస్తూ ఉండండి. టెన్షన్‌ నుంచి బయటపడడంతో ముఖం కాంతివంతంగా మారతుంది. చర్మం వీలైనంత వరకు తేమగా ఉండేలా చూసుకోండి. అంటే డీహైడ్రేట్‌కు గురికాకుండా చూసుకోవాలి. లేదంటే చర్మం పొడిబారిపోతుంది. చర్మాన్ని మాయిశ్చరైజర్‌తో మసాజ్‌ చేసుకోవాలి. ఐస్‌క్యూబ్స్‌ తీసుకొని చర్మంపై రుద్దడం వల్ల చర్మం మెరుస్తుంది. ఇలా కాకపోయిన టవల్‌పై ఐస్‌క్యూబ్స్‌ ఉంచి నిద్రకు 15 నిమిషాల ముందు చర్మంపై రుద్దుకుంటే మంచిది.

Tags: men beauty tips
Previous Post

ప్రతిరోజూ ఇవి తింటే ఆరోగ్యం మీ సొంతం

Next Post

పిల్లలకు చ‌ద్ది అన్నం పెట్టవద్దు..!

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.