Lemon Juice : ఏ మాత్రం దాహం వేసిన, మనం తినే ఆహారం నోటికి రుచించకపోయిన, పుల్లపుల్లగా ఏదైనా తినాలనిపించిన, ముఖ్యంగా వేసవిలో సహజ సిద్ద పానీయాలను తయారు చేసుకోవాలన్న ముందుగా అందరికి గుర్తుకు వచ్చేది నిమ్మకాయ. ఇది కూరగాయలకు సంబంధించిది అలాగే పండ్ల జాతికి సంబంధించింది. దీనిని మనం విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. నిమ్మకాయలో ఔషధ గుణాలు ఉన్నాయని, మన ఆరోగ్యానికి ఇది ఎంతగానో మేలు చేస్తుందని మనందరికి తెలుసు. మనకు ఎంతగానో ఉపయోగపడే ఈ నిమ్మకాయ గురించి వైద్య నిపుణులు ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని కనుగొన్నారు. నిమ్మకాయ క్యాన్సర్ ను కూడా నివారిస్తుందట.
ఇది వినగానే మనలో చాలా మంది ఆశ్చర్యపోతుంటారు. కానీ ఇది నిజం. నిమ్మకాయలో ఉండే లెమనాయిడ్ అనే పదార్థం కొన్ని రకాల క్యాన్సర్ లను నివారిస్తుంది. వేసవి కాలంలో నిమ్మకాయలను ఎక్కువగా వాడుతూ ఉంటాం. అలాగే నిమ్మకాయతో నిమ్మ కాయ పచ్చడి, నిమ్మకాయ పులిహోర వంటి ఆహార పదార్థాలను కూడా తయారు చేస్తాం. వంట్లలో నిమ్మరసాన్ని ఉపయోగించడం వల్ల వంట రుచి పెరుగుతుంది. కేవలం వేసవిలోనే కాకుండా నిమ్మకాయను తరచూ తీసుకుంటూ ఉండాలి. ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి ఈ నీటిని తాగాలి. నిమ్మకాయలో యాంటీ క్యాన్సర్ లక్షణాలు ఉంటాయి కనుక మొత్తం శరీరం మీద ప్రభావాన్ని చూపిస్తుంది.
నిమ్మకాయలో సిట్రస్ పెక్టిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది రొమ్ము క్యాన్సర్, ప్రొటెస్ట్ గ్రంథి క్యాన్సర్ ను అరికడుతుంది. నిమ్మలో ఉన్న ఫైటో న్యూట్రియన్స్ చాలా శక్తివంతమైనవి. ఇవి శరీరంలో వ్యాధి నిరోధకతను పెంచి కొన్ని రకాల క్యాన్సర్ లను కూడా నివారిస్తాయి. నిమ్మరసం కలిపిన నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. నిమ్మలో ఉండే లెమనాయిడ్స్ తో పాటు నిమ్మలో ఉండే 22 రకాల పదార్థాలు క్యాన్సర్ ను నిరోధిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. నిమ్మకాయ క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని దాదాపు 50 శాతం వరకు తగ్గిస్తుందని తేలింది. నిమ్మకాయను ఉపయోగించడం వల్ల మనం ఇతర ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా పొందవచ్చు. శరీరంలోని వ్యర్థాలు బయటకు పోవడం కూడా నిమ్మ చక్కగా పని చేస్తుంది.
నిమ్మలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ ను నిరోధించి వృద్ధాప్యాన్ని త్వరగా దరి చేరకుండా చేస్తాయి. నిమ్మకాయను ఉపయోగించడం వల్ల మనం చక్కటి ముఖ వచ్ఛస్సును కూడా సొంతం చేసుకోవచ్చు. నిమ్మరసాన్ని ఉపయోగించి వివిధ రకాల ఇన్ ఫెక్షన్ లను కూడా తగ్గించుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు నిమ్మరసాన్ని తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు. నిమ్మలో ఉండే ప్రెక్టిన్ అనే పదార్థం కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. నిమ్మరసం, తేనె కలిపిన నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. జుట్టు రాలడాన్ని కూడా నిమ్మ తగ్గిస్తుంది. నిమ్మరసంలో, తేనె కలిపి తలకు పట్టించి మర్దనా చేయాలి. 20 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి. తరచూ ఈ విధంగా చేస్తూ ఉంటే జుట్టు రాలడం తగ్గడంతో పాటు చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. ఈ విధంగా నిమ్మకాయ మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని ఉపయోగించడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన వ్యాధుల నుండి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.