Teeth Pain : మనల్ని వేధించే దంత సంబంధిత సమస్యల్లో పిప్పి పన్ను సమస్య కూడా ఒకటి. ఈ సమస్య కారణంగా బాధపడే వారి సంఖ్య నేటి తరుణంలో పెరుగుతుందనే చెప్పవచ్చు. పెద్ద వాళ్లతో పోల్చుకుంటే చిన్న పిల్లల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. పిప్పి పన్ను వల్ల కలిగే నొప్పి అంతా ఇంతా కాదు. మనం తిన్న ఆహార పదార్థాలు పిప్పి పన్నులో ఇరుక్కుపోయి మరింత నొప్పిని, ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. పిప్పి పన్ను వల్ల ఆ భాగంలో వాపు కూడా వస్తుంది. దంతాలను, కంటి నరాలకు సంబంధం ఉండడం వల్ల ఈ పిప్పి పన్ను కారణంగా కంటి నుండి నీరు కూడా కారుతుంది.
కొంతమందిలో పిప్పి పన్ను సమస్య రాగానే జ్వరం కూడా వస్తుంది. ఈ పిప్పి పన్ను సమస్య నుండి బయటపడడానికి పెయిన్ కిల్లర్ లను, యాంటీ బయాటిక్ మందులను వాడుతూ ఉంటారు. అయినప్పటికి ఈ నొప్పి మాత్రం తగ్గదు. ఇవే కాకుండా ఆయుర్వేదం ద్వారా కూడా మనం ఈ సమస్య నుండి బయట పడవచ్చు. పిప్పి పన్ను సమస్యను తగ్గించే ఆయుర్వేద చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పిప్పి పన్ను సమస్యను తగ్గించడంలో సీతాఫలం ఆకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సీతాఫలం ఆకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ ఆకులు మనకు విరివిరిగా లభిస్తూ ఉంటాయి. పిప్పి పన్ను సమస్యను తగ్గించడంలో సీతాఫలం చెట్టు ఆకు చక్కగా పని చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ ముందుగా రెండు లేదా మూడు సీతాఫలం ఆకులను సేకరించి శుభ్రంగా కడగాలి. తరువాత వాటికి నాలుగు లేదా ఐదు మిరియాలను కలిపి లేహ్యంగా నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని పిప్పి పన్ను పరిమాణంలో ఉండగా చేసుకోవాలి. ఈ ఉండను పిప్పి పన్ను వల్ల కలిగిన రంధ్రంలో ఉంచి నొక్కి పెట్టాలి. ఇలా చేయడం వల్ల పిప్పి పన్ను సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. పెయిన్ కిల్లర్ లను, యాంటీ బయాటిక్స్ ను వాడడం వల్ల ఉపశమనం కలిగినప్పటికి భవిష్యత్తులో మనం తీవ్ర దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక ఈ విధంగా సీతాఫలం ఆకును, మిరియాలను ఉపయోగించి సహజ సిద్ద పద్దతిలో పిప్పి పన్ను సమస్యను శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు.