White To Black Hair : ప్రస్తుత కాలంలో మనల్ని వేధించే జుట్టు సంబంధిత సమస్యల్లో తెల్ల జుట్టు సమస్య కూడా ఒకటి. వయసుతో సంబంధం లేకుండా అందరిని ఈ సమస్య వేధిస్తుంది. పోషకాహార లోపం, వాతావరణ కాలుష్యం, ఒత్తిడి, ఆందోళన వంటి వివిధ రకాల సమస్యల కారణంగా జుట్టు తెలబడుతుంది. చిన్న వయసులోనే జుట్టు తెలబడడం వల్ల చాలా మంది ఆత్మనూన్యత భావనకు గురి అవుతూ ఉంటారు. ఈ సమస్య నుండి బయటపడడానికి మార్కెట్ లో లభించే అన్ని రకాల హెయిర్ డైలను వాడుతూ ఉంటారు. వీటిని వాడడం వల్ల జుట్టు నల్లగా మారినప్పటికి భవిష్యత్తులో అనేక రకాల దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటిలో వాడిన రసాయనాల కారణంగా చర్మ సమస్యలు, దురదలు, దద్దర్లు వంటివి వస్తాయి.
ఎటువంటి దుష్ప్రభావాలు కలగకుండా మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఒక మిశ్రమాన్ని తయారు చేసుకుని వాడడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారడంతో పాటు జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. తెల్ల జుట్టును నల్లగా మార్చే ఈ మిశ్రమం ఏమిటి..దీనిని ఎలా తయారు చేసుకోవాలి..అలాగే దీనిని ఎలా ఉపయోగించాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అడుగు మందంగా ఉండే ఒక ఇనుప కళాయిలో 2 టేబుల్ స్పూన్ల ఉసిరి పొడిని తీసుకోవాలి. తరువాత ఈ కళాయిని స్టవ్ మీద ఉంచి చిన్న మంటపై ఉసిరి పొడిని వేడి చేయాలి. దీనిని కలుపుతూ నల్లగా అయ్యే వరకు వేడి చేయాలి. ఉసిరి కాయ పొడి నల్లగా మారిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకుని చల్లగా అయ్యే వరకు ఉంచాలి. తరువాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ కాఫీ పొడిని వేసి కలపాలి.
తరువాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ కలబంద గుజ్జును ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను వేసి పేస్ట్ లా కలుపుకోవాలి. ఇలా తయారు చేయడం వల్ల జుట్టును నల్లగా మార్చే మిశ్రమం తయారవుతుంది. దీనిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని దూదితో లేదా బ్రష్ తో జుట్టుకు రాసుకోవాలి. జుట్టు కుదుళ్ల నుండి జుట్టు చివరి వరకు ఈ మిశ్రమాన్ని చక్కగా పట్టించాలి. తరువాత దీనిని ఒక గంట పాటు అలాగే జుట్టుకు ఉంచాలి. గంట తరువాత రసాయనాలు తక్కువగా ఉండే షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు నెలరోజుల పాటు దీనిని వాడడం వల్ల మన తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. అలాగే దీనిని ఉపయోగించడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు కూడా ఉండవు. ఈ చిట్కాను వాడడం వల్ల జుట్టు నల్లగా మారడంతో పాటు జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.