Fake Vs Original Eggs : పుట్ట‌లు పుట్ట‌లుగా వ‌స్తున్న న‌కిలీ కోడిగుడ్లు.. వీటిని గుర్తించ‌డం ఎలా.. ఈ సింపుల్ టిప్స్‌ను ఫాలో అవ్వండి..!

Fake Vs Original Eggs : నేడు న‌డుస్తోంది అంతా న‌కిలీల యుగం. ఏది అస‌లుదో, ఏది న‌కిలీదో క‌నుక్కోవ‌డం సామాన్య మాన‌వుల‌కు అత్యంత క‌ఠిన‌త‌రంగా మారింది. మ‌నుషులే క‌ల్తీగా మారుతున్న నేటి త‌రుణంలో ఇక వ‌స్తువుల‌ను ప‌ట్టించుకునే వారెవ‌రు. అంత‌గా క‌ల్తీల రాజ్యం విస్త‌రించింది. అది ఎప్ప‌టిక‌ప్పుడు చాప కింద నీరులా ప్ర‌వహిస్తూనే ఉంది. కానీ ఎప్పుడు ప‌డితే అప్పుడు అది బ‌య‌ట ప‌డ‌డం లేదు. ఎప్పుడో ఒక‌సారి ఏదో ఒక సంద‌ర్భంలోనో త‌ప్ప మిగ‌తా స‌మ‌యాల్లో మ‌నం న‌కిలీ వ‌స్తువుల గురించి ప‌ట్టించుకోవ‌డ‌మే మానేశాం. కానీ వాటి ప‌ట్ల ఎప్ప‌టికీ, నిరంత‌రాయంగా అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిందే. లేదంటే అనారోగ్యాల‌ను కొని తెచ్చుకున్న వార‌మ‌వుతాం.

ఇంత‌కీ ఇప్పుడు క‌ల్తీ అవుతున్న లేటెస్ట్ వ‌స్తువు ఏమిటో తెలుసా..? కోడిగుడ్లు.. అవును, అవే. అదేంటీ, కోడి పెట్టే గుడ్ల‌ను క‌ల్తీ చేస్తారా ఎవ‌రైనా..? అలా చేయ‌గ‌ల‌రా అసలు..? అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా..? అయినా మేం చెబుతోంది నిజ‌మే. కొన్ని ప్ర‌త్యేక ప‌దార్థాల‌ను, ర‌సాయ‌నాల‌ను ఉప‌యోగించి త‌యారు చేస్తున్న ఈ నకిలీ కోడిగుడ్లు ఎక్కువ‌గా చైనాలో త‌యార‌వుతున్నాయ‌ట‌. మ‌న తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వీటిని విక్ర‌యిస్తున్న‌ట్టు తాజాగా తెలిసింది. సాధార‌ణ కోడిగుడ్ల క‌న్నా త‌క్కువ ధ‌ర‌కే వ‌స్తుండ‌డంతో వ్యాపారులు వీటిని మామూలు కోడిగుడ్ల‌లో క‌లిపి అమ్ముతున్న‌ట్టు సమాచారం. అస‌లు ఇంత‌కీ వాటిని ఎలా త‌యారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

Fake Vs Original Eggs how to identify them
Fake Vs Original Eggs

గ్లూకోలాక్టేన్‌, బెంజోయిక్ యాసిడ్‌, సెల్యులోజ్‌, ఆలం, అమైనో యాసిడ్‌, సోడియం అల్జినేట్‌, గెలాటిన్ వంటి ప‌దార్థాల‌ను ఉప‌యోగించి ముందుగా ప‌చ్చ‌సొన‌, తెల్ల‌సొన‌ల‌ను విడి విడిగా త‌యారు చేస్తారు. ప‌చ్చ‌సొన అచ్చం గుడ్డు సొన‌లా క‌నిపించాల‌ని దానికి ఒక ప్ర‌త్యేక‌మైన క‌ల‌ర్‌ను క‌లుపుతారు. త‌రువాత తెల్ల‌సొన‌లో ప‌చ్చ‌సొన‌ను ఉంచి దాన్ని కాల్షియం క్లోరైడ్ లేదా కాల్షియం కార్బొనేట్‌తో తయారు చేసిన గుడ్డు లాంటి తెల్ల‌ని షెల్‌లో అచ్చులా పోస్తారు. అప్పుడ‌ది కోడిగుడ్డులా త‌యారవుతుంది. ప్ర‌స్తుతం చైనాలోనే కాదు, మ‌న దేశంలోనూ అక్క‌డ‌క్క‌డ ఇలాంటి న‌కిలీ కోడిగుడ్ల‌ను త‌యారు చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. కాబ‌ట్టి వీటి ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండడం బెట‌ర్‌.

కింద ఇచ్చిన సూచ‌న‌ల‌ను పాటిస్తే న‌కిలీ, అస‌లు కోడిగుడ్ల‌ను సుల‌భంగా గుర్తించ‌వ‌చ్చు. అస‌లు కోడిగుడ్డు క‌న్నా న‌కిలీ కోడిగుడ్డు పై పొర (షెల్‌) బాగా ప్ర‌కాశ‌వంతంగా, షైనీగా క‌నిపిస్తుంది. అస‌లు కోడిగుడ్డుకు షైన్ కొద్దిగా త‌క్కువ‌గా ఉంటుంది. అస‌లైన గుడ్డు క‌న్నా న‌కిలీ కోడిగుడ్డును పైన ట‌చ్ చేస్తే అది కొంత ర‌ఫ్‌గా అనిపిస్తుంది. కోడిగుడ్డును ఊపి చూడాలి. దాన్నుంచి ఏవైనా సౌండ్స్ వ‌స్తే దాన్ని న‌కిలీగా అనుమానించాలి. ఎందుకంటే న‌కిలీ గుడ్డు అయితే దాంట్లోని కెమిక‌ల్ ద్ర‌వాలు సుల‌భంగా క‌రిగిపోతాయి కాబ‌ట్టి. న‌కిలీ గుడ్ల‌కు అస‌లు నీచు వాస‌న ఉండ‌దు. అస‌లు కోడిగుడ్ల‌కు ఎంత లేద‌న్నా కొద్దిగా నీచు వాసన వ‌స్తుంది.

గుడ్డును చిన్న‌గా ట‌క్ ట‌క్ మ‌ని కొట్టి చూడాలి. అస‌లు కోడిగుడ్డు అయితే ట‌క్ ట‌క్ మ‌ని బాగా వినిపిస్తుంది. న‌కిలీ కోడిగుడ్డును ప‌గ‌ల గొట్ట‌గానే అందులోని ద్ర‌వాలు మ‌న ప్రమేయం లేకుండానే సుల‌భంగా క‌లిసిపోతాయి. న‌కిలీ గుడ్డును ప‌గ‌ల‌కొట్టి ఫ్రై చేస్తే అందులో ఉండే ప‌దార్థాలు పెనంపై సుల‌భంగా విస్త‌రిస్తాయి. అస‌లు కోడిగుడ్డ‌యితే సొన‌ల‌ను విస్త‌రించ‌డానికి మ‌నం క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంది. న‌కిలీ గుడ్ల‌లో ప‌చ్చ‌ని సొన కొన్ని సార్లు మ‌ధ్య‌లో తెల్ల‌గా క‌నిపిస్తుంది. ఇలా అస‌లు, న‌కిలీ కోడిగుడ్ల‌కు మ‌ధ్య మ‌నం సుల‌భంగా తేడాలు గుర్తించ‌వ‌చ్చు. దీంతో న‌కిలీ కోడిగుడ్ల‌ను కొని మోస‌పోకుండా జాగ్ర‌త్త వ‌హించ‌వ‌చ్చు.

Share
Editor

Recent Posts