పెట్రోల్ బంకుల్లో మోసాల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఎప్పుడు చూసినా ఎక్కడోక్కడ మోసాల గురించి వింటూ ఉంటాం. పెట్రోల్ బంకులో పెట్రోల్ ఫిల్ చేసుకోవడానికి వెళ్లేటప్పుడు కచ్చితంగా అక్కడ జీరో చూసుకుని.. ఆ తర్వాత పెట్రోల్ ఫిల్ చేయమని మనం చెప్తూ ఉంటాం. అప్పుడు అమౌంట్ ఇస్తాం. ఒక టీవీ ఛానల్ పెట్రోల్ పంప్స్ దగ్గర జరిగే స్కామ్ గురించి తెలిపింది. కస్టమర్లని వాళ్ళు ఎలా మోసం చేస్తున్నారనేది కూడా వివరించారు. సాధారణంగా మనం జీరో చూసాక పెట్రోల్ ఫిల్ చేస్తున్నప్పుడు క్రమంగా సంఖ్య పెరుగుతూ ఉంటుంది. కానీ ఎలా మోసం చేస్తున్నారంటే ముందు జీరో కనబడుతుంది.
ఆ తర్వాత ఒకేసారి, ఎక్కువ అమౌంట్ కి జంప్ అయిపోతుంది. ఇలా, పెట్రోల్ బంకుల్లో మోసం చేస్తున్నారు. ఇలాంటి స్కామ్స్ ఏమి జరగకుండా ఉండడానికి ముందు మీరు పెట్రోల్ బంక్ కి కి వెళ్ళినప్పుడు జీరో చూసుకోండి పెట్రోల్ ఫిల్ చేస్తున్నప్పుడు కచ్చితంగా మీరు అంకెలు ఎలా మారుతున్నాయి అన్నది గమనించాలి ముఖ్యంగా మొదటి కొన్ని సెకండ్లు పెట్రోల్ కొడుతున్నప్పుడు అంకెలు జంప్ అయిపోతున్నాయా లేదా అనేది గమనించాలి.
ఒకేసారి రీడింగ్ జంప్ అయినట్లు కనపడినట్లయితే ఒకసారి ఆపేయమని, మళ్లీ రీసెట్ చేయమని చెప్పండి. ఒకవేళ కనుక పదే పదే మీకు ఇదే సందేహం కలుగుతున్నట్లయితే రిపోర్ట్ చేయడం మంచిది. ఇలా పెట్రోల్ బంకుల్లో చాలా మందిని మోసం చేస్తున్నారు. కాబట్టి పెట్రోల్ కొట్టించుకునేటప్పుడు వీటిని పక్కా ఫాలో అయ్యేటట్టు చూసుకోండి. లేదంటే అనవసరంగా మీరే మోసపోవాల్సి ఉంటుంది.