డబ్బులు పొదుపు చేయాలనుకునే చాలా మంది మ్యుచువల్ ఫండ్స్‌లోనూ పెట్టుబడులు పెడుతుంటారన్న సంగతి తెలిసిందే. కొన్ని రకాల స్టాక్స్ లేదా గోల్డ్ వంటి వాటిని కలిపి మ్యుచువల్ ఫండ్ కంపెనీలు స్కీమ్ రూపంలో అందిస్తాయి. ఈ క్రమంలో ఫండ్‌కు ఒక విలువ ఉంటుంది. దాని ప్రకారం మనం ఏదైనా నిర్దిష్టమైన మ్యుచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెడితే ఆ ఫండ్ నికర యూనిట్ విలువ పెరిగితే మనం పెట్టిన డబ్బుకు విలువ పెరుగుతుంది. ఇలా నెల నెలా సిప్ వేస్తూ పోతే మార్కెట్ పెరిగే కొద్దీ మనకు లాభం వస్తుంది. సాధారణంగా బ్యాంకుల్లో లేదా పోస్టాఫీసుల్లో పలు స్కీముల ద్వారా మనకు 6 నుంచి 8 శాతం వడ్డీ మాత్రమే లభిస్తుంది. కానీ మ్యుచువల్ ఫండ్స్ ద్వారా కనీసం 12 నుంచి 30 శాతం వరకు లాభాలను పొందవచ్చు. అందుకనే కరోనా అనంతరం మ్యుచువల్ ఫండ్స్‌లో చాలా మంది పెట్టుబడులు పెడుతున్నారు.
అయితే మ్యుచువల్ ఫండ్స్‌లో డబ్బును పెట్టడం బాగానే ఉంది కానీ ప్రస్తుతం గత 4 నెలల నుంచి మార్కెట్ అంతా డౌన్ ట్రెండ్‌లోనే ఉంది. గత 3 – 4 ఏళ్ల నుంచి మ్యుచువల్ ఫండ్స్ లో డబ్బులు పెట్టిన వారి సంపద దాదాపుగా 40 నుంచి 50 శాతం వరకు తగ్గింది. దీంతో చాలా మంది మ్యుచువల్ ఫండ్స్‌ను విత్ డ్రా చేస్తున్నారు. కొందరు మార్కెట్ పెరగవచ్చేమోనన్న ఆశతో ఉన్నారు. అయితే నిపుణులు చెబుతున్న ప్రకారం మ్యుచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్న వారు ఇంకా 3 లేదా 4 నెలలు ఆగితే మంచిదని అంటున్నారు.
వచ్చే జూలై లేదా ఆగస్టు నుంచి మళ్లీ మార్కెట్ ఊపందుకునే చాన్స్ ఉందని, కనుక అప్పటి వరకు ప్రజలు ఏమైనా సిప్‌లను గనక వేస్తుంటే వాటిని కొద్ది నెలల పాటు ఆపడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్‌లో ప్రస్తుతం డౌన్ ట్రెండ్ నడుస్తుంది కనుక ఇంకా ఎంత కాలం ఇలా ఉంటుందో చెప్పలేమని, కనుక పెట్టుబడిన పెట్టులు రిస్క్ లేకుండా రావాలంటే ఇప్పుడు ఎంతో కొంత ఉన్న ప్రాఫిట్‌ను బుక్ చేసుకోవాలని, లేదంటే ఇంకా డబ్బులను నష్టపోయే అవకాశం ఉంటుందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. అయితే ఏళ్ల తరబడి ఉన్న సిప్‌లను ఇప్పుడు తీయాలంటే చాలా మందికి మనసు ఒప్పుకోవడం లేదు. కానీ మార్కెట్‌ను చూస్తే మాత్రం గుబులు పుడుతోంది. కనుక ఈ విషయంలో ఎవరికి వారు నిర్ణయం తీసుకోవాల్సిందే.