సహజంగా బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు, పోస్ట్ ఆఫీస్లు ఎన్నో రకాల స్కీములను అందించి కస్టమర్లను అట్రాక్ట్ చేస్తారు. అయితే ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ విడుదల చేసిన ఈ స్కీం అందరినీ అట్రాక్ట్ చేస్తోంది అని చెప్పవచ్చు. కేవలం నెలకు 5000 రూపాయలు ఈ స్కీం లో ఇన్వెస్ట్ చేయడం తో మీరు రూ. 16 లక్షల వరకు పొందవచ్చు . పైగా దీంట్లో ఎటువంటి రిస్క్ కూడా లేదు.
తాజాగా పోస్ట్ ఆఫీస్ ఎంతో మంచి పిపిఎఫ్ స్కీమ్ ను విడుదల చేసింది. ఇది ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్. దీనిలో ఇన్వెస్ట్ చేయడంతో 7.1% ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. ఈ ఇంట్రెస్ట్ రేట్ వేరే స్కీం లతో కంపేర్ చేస్తే ఎంతో ఎక్కువ కనుక ఈ స్కీంలో ఇన్వెస్ట్ చేయడం వలన తిరిగి ఎక్కువ అమౌంట్ ను సంపాదించవచ్చు. ఈ స్కీం పెన్షనర్స్, ఎంప్లాయిస్ ఎవరైనా తీసుకోవచ్చు.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఎకౌంట్ మరియు జాయింట్ అకౌంట్స్ ను పోస్ట్ ఆఫీస్ పర్మిట్ చేయదు. ఈ స్కీం లో భాగంగా మైనర్స్ కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. కాకపోతే పేరెంట్స్ లేక లీగల్ గార్డియన్స్ ఉండాలి. ఈ స్కీం తీసుకోవడంతో ఇన్కమ్ టాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సెక్షన్ 80 సి ప్రకారం 1,50,000 వరకు డిడక్షన్ చేసుకోవచ్చు.