ఒక్కప్పుడు చాలా వరకు చదవడం అంటే ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ అనే అనుకునేవారు. చాలా తక్కువ మంది మాత్రమే వేరే కోర్సుల వైపు వెళ్తారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే కాదు ఇంకా అనేక రంగాల్లో కూడా కోర్సులు చేస్తున్నారు. అయితే వీరికి కూడా ఇంజనీర్లు లేదా వైద్యుల లాగే జీతం కూడా బాగానే వస్తుంది. మరి ఆ ఉద్యోగాలు ఏంటో చూసేద్దామా.. బాహుబలి వంటి సినిమాలు చూసాక తెలిసే ఉంటుంది VFX వారికి ఎంత పని ఉంటుందో. గత కొన్ని ఏళ్ళ నుండి VFX, యానిమేషన్ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువ అయ్యాయి. మొదట్లో నెలకు నలభై వేలు వచ్చినా కొంచెం అనుభవం వస్తే నెలకు లక్షల జీతం వస్తాయి.
ఇప్పుడు ఉన్న బిజీ జీవితాల్లో ఏదైనా శుభకార్యం చేసుకోవాలి అంటే కూడా అన్ని సమకూర్చుకోవడానికి తగ్గినంత సమయం ఉండట్లేదు. అందుకనే ఈవెంట్ మేనేజర్లకు ఆ పనులు అప్పచెబుతారు. వీరికి ఒక ఈవెంట్ కి దాదాపు లక్ష రూపాయిల వారికి వస్తాయి. మ్యూజిక్ అంటే ఇష్టం ఉన్నవారికి డీజే వృత్తి బాగా నప్పుతుంది. ఇప్పుడు మ్యూజిక్, ఎంటర్టైన్మెంట్ రంగం విజృంభిస్తున్న రంగాలు. ఇందులోకి అడుగు పెట్టి విజయం సాధించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ వృత్తికి అవసరం అయ్యే కోర్సులు అందించడానికి కళాశాలలు కూడా ఉన్నాయి.
ఏదైనా స్పోర్ట్స్ చూస్తున్నాము అంటే తప్పనిసరిగా కామెంట్రీ ఉండాల్సిందే. కామెంట్రీ లేకుండా ఎలాంటి ఆటను చూడలేము. స్పోర్ట్ కామెంటేటర్లకు కూడా జీతం బాగా వస్తుంది, ఈ వృత్తిలో మంచిగా స్థిర పడిన వారికి ఒక రోజుకి దాదాపు పాతిక వేలు ఇస్తారు. వంట చెయ్యడమంటే ఇష్టం ఉన్నవారికి చెఫ్ గా రాణించే అవకాశాలు చాలా ఉన్నాయి. వీరు కేవలం వంట చెయ్యడమే కాదు వివిధ వంట పద్ధతులు, పదార్థాలు, పోషణ, వంటకాలు, రుచులు నేర్చుకుంటారు. హోటల్ మానేజ్మెంట్ కోర్సులు చేసేవారికి చెఫ్ గా మారే అవకాశాలు ఉన్నాయి.
మర్చంట్ నేవీ వారికి ఎక్కువగా పని ఉండదు, కేవలం అవసరం ఉన్నపుడు మాత్రమే కార్గో, అప్పుడప్పుడు ప్రయాణీకులను రవాణా చెయ్యాల్సి ఉంటుంది. వీరికి కొత్త కొత్త ప్రదేశాలు చూసే అవకాశం కూడా లభిస్తుంది.