Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home inspiration

పనిమనిషి, యజమాని మధ్య‌ ఆసక్తికర సంభాషణ… క‌చ్చితంగా అందరిలో మార్పు తెస్తుంది..

Admin by Admin
May 29, 2025
in inspiration, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఆమె వాళ్లింట్లో పనిమనిషి…ఉదయం వచ్చి ఇళ్ళు ఊడ్వడం దగ్గరి నుండి, బట్టలుతకడం, పాత్రలు కడగడం వరకు తానే చేస్తుంది. మళ్ళీ సాయంత్రం వచ్చి మరోసారి తన పనులు చేసుకొని వెళుతుంది. అయితే పండుగకు వెళ్లి వచ్చిన తర్వాత ఆమె చెప్పిన మాటలు …ఆ ఇంటి యజమానికి సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేశాయ్..ఆ సంభాషణను మీరుకూడా వినండి మీలో కూడా అనూహ్యమైన మార్పు వస్తుంది.

భార్య: ఏవండీ మీ బట్టలు లాండ్రీకి తక్కువగా వేయండి. భర్త: ఏం? ఏమైంది.

భార్య: పనిమనిషి కొన్ని రోజుల పాటు రాదు. భర్త:ఎందుకని?

భార్య: వినాయక చవితి పండుగని తన కూతురుని, తన మనవరాలిని చూడటానికి ఊరికి వెళుతోంది. భర్త :సరే.. సరే.

భార్య:మర్చిపోకుండా ఆమెకు పండుగ కానుకగా రూ.500 ఇవ్వండి. భర్త: ఎలాగో ఉగాది వస్తుంది కదా, ఆమెకు అప్పుడే డబ్బులు ఇవ్వొచ్చు కదా.

భార్య: ఆమె పనిమనిషిగా కొన్ని ఇళ్ళలో పనిచేస్తూ ఉంటుంది. పేదమహిళ. తనకు వచ్చే కొంత ఆదాయంలో తన కూతురు, మనవరాలిని చూడటానికి వెళ్తుంది. మనం ఇచ్చే డబ్బులతో ఆమెకు కాసింత ఆసరానిస్తాయ్. భర్త:అబ్బా నువ్వు మరీ సెంటిమెంట్ గా మాట్లాడకు.

interesting conversation between home owner and maid

భార్య:మీరేమి డబ్బు గురించి ఆలోచించకండి. ఓ పూట మనం టైం పాస్ కు తినే పిజ్జా తినకుండా మానేస్తే చాలు ఆ డబ్బులు కవర్ అవుతాయ్. భర్త:బాగుంది నీ ఆలోచన. సరేనని ఆమెకు 500 రూపాయలు ఇచ్చారు ఆ దంపతులు.

ఆ పనిమనిషి మూడురోజుల తర్వాత తన కూతురు, మనవరాలిని చూసి మళ్ళీ పనిలోకి వచ్చింది.

యజమాని: ఏంటమ్మా.. ఊరికి వెళ్లి వచ్చావా? కూతురు మనవరాలు ఎలా ఉన్నారు. పనిమనిషి: వెళ్ళాను అయ్యా. చాలా బాగున్నారు. మీరిచ్చిన 500 రూపాయలతో మా మధ్య మరింత సంతోషం నెలకొంది.

యజమాని::అవును రూ. 500 తో ఏం చేశావు? పనిమనిషి: నా మనవరాలికి రూ.150 ఒక చొక్కా,రూ. 40 కు ఒక బొమ్మ తీసుకున్నాను. మా కూతురుకి కొన్ని స్వీట్లు రూ.50 , దేవుడు దర్శనానికి రూ. 60. నా కూతురికి రూ.25 చేతి గాజులు, నా అల్లుడికి రూ.50 కు అందమైన బెల్ట్ తీసుకున్నాను. మిగిలిన డబ్బుతో నా మనవరాలికి కావాల్సిన బుక్స్, చదువుకి కావలసిన వస్తువులు కొనిచ్చాను.

యజమాని:: ఏంటి. అన్ని వస్తువలు ఆ రూ.500 కేనా.?

ఒక్కసారిగా షాక్ కు గురైన ఆ పెద్దమనిషికి పిజ్జా గుర్తుకు వచ్చింది, తలనిండా ఆ పిజ్జా గురించే ఆలోచనలు ఉన్నాయి. మనం ఒక్క పిజ్జాకు అయ్యే ఖర్చుతో పనిమనిషి ఇవన్నీ కొనగలిగింది. తన కుటుంబానికి కావాల్సిన అవసరాలను తీర్చింది. తన కూతురు, అల్లుడు, మనవరాలు ఇలా అందరినీ సంతోషపెట్టి, ఆమె సంతోషంగా గడిపింది. అంటూ తనలో తానే ఎన్నో ఆలోచించుకున్నాడు…ఆమెను చూసి నేర్చుకోవాలి మనం ఎంత వృధాగా డబ్బు ఖర్చు పెడుతున్నామోనని ఆలోచించసాగాడు.

Tags: home ownermaid
Previous Post

ఈ ఒక్క స‌హ‌జ‌సిద్ధ‌మైన డ్రింక్‌… 50 వ్యాధుల‌ను న‌యం చేస్తుంది..!

Next Post

విరాట్ కోహ్లి తాగే నీళ్లు ఏమిటో తెలుసా..? ఖ‌రీదు ఎంతంటే..?

Related Posts

వైద్య విజ్ఞానం

ఉద‌యం టిఫిన్ చేయ‌డం మానేస్తున్నారా.. అయితే ఎంత న‌ష్టం జరుగుతుందో తెలుసా..?

June 13, 2025
హెల్త్ టిప్స్

పురుషులు ఈ సూచ‌న‌లు పాటిస్తే లైంగిక శ‌క్తిని సుల‌భంగా పెంచుకోవ‌చ్చు..

June 13, 2025
lifestyle

మీరు భోజ‌నం చేసే తీరును బ‌ట్టి కూడా మీ వ్య‌క్తిత్వం ఎలా ఉంటుందో చెప్ప‌వ‌చ్చు.. ఎలాగంటే..?

June 13, 2025
చిట్కాలు

ఇవి ఏమిటో.. ఇవి అందించే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఏమిటో మీకు తెలుసా..?

June 13, 2025
inspiration

మ‌నిషి రూపాన్ని చూసి ఎన్న‌డూ అంచ‌నా వేయ‌కూడ‌దు.. ఆలోచింప‌జేసే క‌థ‌..

June 13, 2025
Off Beat

రోల్స్ రాయ్స్ కార్ల‌తో చెత్త ఊడ్పించిన మ‌హా రాజు.. ఈయ‌న చేసింది తెలిస్తే షాక‌వుతారు..

June 13, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!