సినీ నటులు, సెలిబ్రటీలు, మోడల్స్ వంటి వారికి వుండే కోచ్ లు వారు ఆహార, వ్యాయామాలు ఎలా చేయాలనేది తెలుపుతూ శిక్షణ నిస్తారు. వీరి ప్రకారం ఏ రకమైన ఆహారాలు, వ్యాయామాలు శారీరక వ్యవస్ధను బలపరచి, ఫిట్ గా వుంచుతాయో పరిశీలించండి. రోజులో మొదటి ఆహారంగా ఒక కప్పు గ్రీన్ టీ, దాని తర్వాత ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి.
బాదంపప్పులు, బ్లూ బెర్రీలు, ప్రొటీన్ పౌడర్ లను పాలలో కలిపి ఒక గ్లాసు తాగాలి. బ్రేక్ ఫాస్ట్ సమయంలోనే మల్టి విటమిన్ టాబ్లెట్ లు వేసుకోవాలి. బ్రేక్ ఫాస్ట్ చేసిన గంట తర్వాత వ్యాయామాలు మొదలు పెట్టాలి. అయితే ఇవి తేలికైన డ్యాన్సు అడుగులుగా వుండాలి. సులభతరమైన ఈ వ్యాయామాలు ముగిసిన తర్వాత ఒక గ్లాసు వెజిటబుల్ జ్యూస్ తాగాలి.
ఇక మధ్యాహ్న భోజనంలో టొమాటాలు, దోసకాయ, ఎండు ఫలాలు మొదలైనవి తక్కువ కార్బోహైడ్రేట్లు వుండే ఆహారాలు తీసుకోవాలి. మాంసాహారులైతే, ఉడికించిన టర్కీ, గ్రిల్డ్ చికెన్, కూరలతో తినాలి. సాయంకాలం చిరుతిండి చాలా తక్కువగా వుండాలి. వెజిటబుల్ జ్యూస్ వంటివి చాలు. డిన్నర్ లో వేడిగా వుండే వెజిటబుల్ సూప్, వెజిటబుల్ సలాడ్ వంటివి తీసుకోవాలి.