Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

ఆ ఇద్దరు స్నేహితులు ట్రైన్ మిస్ అయ్యారు..! కానీ ఇద్దరిలో ఎవరెక్కువ దురదృష్టవంతుడో చెప్పగలరా.?

Admin by Admin
May 18, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఇప్పుడు మేం చెప్పబోయేది సైకాలజీకి చెందినది. కాబట్టి కింద ఇచ్చిన ప్రశ్నలను చాలా జాగ్రత్తగా చదవండి. అనంతరం మేం అడిగే ఒక ప్రశ్నకు జవాబు చెప్పండి. ఇక ఆ మ్యాటర్‌ ఏంటో చూద్దామా..! సందర్భం-1.. మీరు ఉదయం 11 గంటలకు ట్రెయిన్‌ ఎక్కాల్సి ఉంది. కానీ ట్రాఫిక్‌ జాం కారణంగా అరగంట ఆలస్యంగా స్టేషన్‌కు వచ్చారు. 11.30 కి స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే అప్పటికే రైలు వెళ్లిపోయింది. కరెక్ట్‌గా 11 గంటలకే ట్రెయిన్‌ బయల్దేరింది. సందర్భం-2.. మీ ఫ్రెండ్‌ ఉదయం 11 గంటలకు ట్రెయిన్‌ ఎక్కాల్సి ఉంది. కానీ ట్రాఫిక్ జాం కారణంగా అరగంట ఆలస్యంగా స్టేషన్‌కు చేరుకున్నాడు. దీంతో 11.30కి స్టేషన్‌కు వచ్చాడు. అయితే ట్రెయిన్‌ మాత్రం 25 నిమిషాలు ఆలస్యంగా.. అంటే.. 11.25 కి బయల్దేరింది.

ఇక ప్రశ్న చూద్దాం… పైన చెప్పాం కదా, మీకు, మీ ఫ్రెండ్‌కు ట్రెయిన్‌ మిస్‌ అయిందని.. అయితే మీ ఇద్దరిలో మిక్కిలి దురదృష్టవంతుడు ఎవరు..? ఆ ఏముందీ.. నా స్నేహితుడే అవుతాడు. ఎందుకంటే కేవలం 5 నిమిషాల వ్యవధిలోనే ట్రెయిన్‌ను మిస్‌ అయ్యాడు కదా. కాబట్టి అతనికే ఎక్కువ బాధ ఉంటుంది.. అంటున్నారు కదా.. అయితే మీరు చెప్పింది కరెక్టే. ఎందుకంటే నూటికి 95 శాతం మంది ఇదే చెబుతారు. 5 నిమిషాలు ముందు లేచి ఉంటే.. 5 నిమిషాల‌ ముందు బయల్దేరి ఉంటే… ఇలా కేవలం 5 నిమిషాలు ఆలస్యం అయ్యేది కాదు, టైముకు ట్రెయిన్‌ను అందుకునే వాడిని అని మీ స్నేహితుడు ఆలోచిస్తాడు. కానీ మీకు అంత బాధ ఉండదు.

how logic works in these 2 different situations

ఇక ఏదైనా పోటీలో సిల్వర్‌ మెడల్‌ సాధించిన వాడికి ఎక్కువ బాధ అనిపిస్తుంది. ఎందుకంటే గోల్డ్‌ మెడల్‌ సాధించిన వారికి, సిల్వర్‌ మెడల్‌ సాధించిన వారికి విజయంలో తేడా కేవలం కొంత మాత్రమే ఉంటుంది. అదే బంగారు మెడల్‌ సాధించిన వ్యక్తికి, కాంస్య మెడల్‌ సాధించిన వ్యక్తికి తేడా బాగా ఉంటుంది కనుక సిల్వర్‌ మెడల్‌ సాధించిన వారే ఎక్కువ ఫీలవుతారు. తమకు గోల్డ్‌ మెడల్‌ రాలేదే అని బాధ పడుతారు. కేవలం కొంత తేడాతో ఎందుకు ఓడిపోయాం అని ఫీలవుతారు. అయితే ఇలా ఆలోచించడం, ఫీల్‌ కావడం ఎవరి తప్పు కాదు లెండి. కానీ దీనికి సైకాలజీలో ఓ పేరు ఉంది. ఇలా ఆలోచించడాన్ని Counterfactual Thinking అంటారు..! భలే ఆశ్చర్యంగా ఉంది కదా..!

Tags: logic
Previous Post

దోమకాటుతో AIDS వస్తుందా.? వైద్యులు ఏమంటున్నారు..?

Next Post

కంచిలోని బంగారు బల్లి, వెండి బల్లి రహస్యం మీకు తెలుసా..?

Related Posts

వినోదం

స్కూల్ ఫీజ్ క‌ట్ట‌లేక…కార్పెంట‌ర్ ప‌నిలో చేరిన దాస‌రి ! ద‌ర్శ‌క‌ర‌త్న గురించి మ‌న‌కు తెలియ‌ని కోణం.!!

June 1, 2025
information

ఎస్‌బీఐ లోగోను అలా ఎందుకు డిజైన్ చేశారో తెలుసా.? వెనకున్న కారణం, దాగున్న అర్థం ఇదే..!

June 1, 2025
ఆధ్యాత్మికం

ఏయే దానాలు చేయ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయంటే..? అద్భుత‌మైన స‌మాచారం మీ కోసం..

June 1, 2025
చిట్కాలు

ఈ చిట్కాల‌ను రోజూ పాటిస్తే మీ జుట్టుకు ఎలాంటి ఢోకా ఉండ‌దు..!

June 1, 2025
హెల్త్ టిప్స్

ఫ్రిజ్ లో ఈ వ‌స్తువుల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ పెట్ట‌కూడ‌దు..

June 1, 2025
ఆధ్యాత్మికం

మంచం మీద కూర్చుని తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

June 1, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!