జీవిత సహచరిణిగా భార్యకు అన్ని విషయాలను భర్త చెప్పాలి. కానీ కొన్ని విషయాల్లో మాత్రం గోప్యత తప్పనిసరి అని ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో చెబుతున్నాడు. ఈ విషయాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. భార్యాభర్తల మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదని చెబుతారు. భార్యభర్తల మధ్య రహస్యాలు ఉంటే అది వారి బంధానికే చేటు తెచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతారు. అయితే కొన్ని విషయాల్లో మాత్రం గోప్యత తప్పనిసరి అని ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో చెబుతున్నాడు. ఈ విషయాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అవమాన పడ్డ సంఘటనలను షేర్ చేసుకోకండి. మీకు ఏదైనా అవమానం ఎదురై ఉంటే ఆ విషయాన్ని భార్యకు చెప్పకండి. ఏ భార్య కూడా దీనిని తట్టుకోలేదు. విన్న వెంటనే కోపంతో రగిలి పోతుంది. అటువంటి పరిస్థితిలో, ఆమె ఎటువంటి సంబంధం గురించి పట్టించుకోదు. మీ వాస్తవ ఆదాయాలు. తెలివైన భర్త తన భార్యకు తన నిజమైన ఆదాయం గురించి చెప్పకూడదని చాణక్యుడు చెబుతాడు. చాణక్య నీతి ప్రకారం.. తన భర్తకు తక్కువ ఆదాయం అని తెలిస్తే సదరు భార్య అతడిని గౌరవించదు. ఎగతాళి కూడా చేస్తుంది. అయితే తన సంపాదన ఎక్కువ అని తెలిస్తే భార్య ఎక్కువగా ఖర్చు చేస్తుంది. ఈ కారణంగా తన సంపాదన విషయంలో భార్యతో గోప్యత అవసరం.
మీరు ఎవరికైనా డబ్బును విరాళంగా ఇచ్చినా ఆ విషయాలను కూడా భార్యతో షేర్ చేసుకోకూడదని చాణక్యుడు చెబుతున్నాడు. బలహీనతను బయటపెట్టకు. భర్త తన బలహీనత గురించి ఎప్పుడూ భార్యకు చెప్పకూడదు. ఎందుకంటే కొన్నిసార్లు మహిళలు తెలియకుండానే ఇతరుల ముందు ప్రస్తావిస్తుంటారు. ఇది కాకుండా, భార్య చెడుగా ఉంటే, ఆమె స్వయంగా దానిని సద్వినియోగం చేసుకోవడం ప్రారంభిస్తుంది.