ఆకాశంలో శుభ్రపరిచి ఖాళీచేసే విధానం ఎక్కడా లేదు. పైగా వ్యర్దాలు పొరపాటున లీక్ అయితే ఆ విమాన సంస్థకు జరిమానా తప్పదు. కానీ అటువంటి పరిస్థితి కలిగే అవకాశం ఏమాత్రం లేదు. ఎందుకంటే ఎటువంటి లీకులు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కాబట్టి భయపడాల్సిన పనిలేదు. మనం సాధారణంగా ఇళ్లల్లో ఉపయోగించే బాత్రూమ్/టాయిలెట్ లకు భిన్నంగా విఆనంలోని బాత్రూములు ఉంటాయి. వీటిలోని టాయిలెట్స్ లో వాక్యూమ్ సిస్టం ని ఉపయోగిస్తారు. ఈ వాక్యూమ్ సిస్టం టాయిలెట్ లోని వ్యర్థలను వాక్యూమ్ ద్వారా లాగేసుకుని ఒక వ్యర్దాల ట్యాంక్ లోకి పంపిస్తుంది. విమానం ల్యాండ్ అయ్యాక ఆ ట్యాంక్ ని ట్యాంకర్ల సాయంతో ఖాళీచేస్తారు. సాధారణ టాయిలెట్స్ ని శుభ్రపరచడానికి ఎక్కువ నీటిని ఉపయోగించాల్సివస్తుంది. విమానాల్లో ఎక్కువ నీటిని మోసుకువెళ్తే విమానం బరువు పెరిగి ఇంధనం వ్యయం పెరుగుతుంది. అందుకు బదులుగా ఈ వాక్యూమ్ సిస్టం ని ఉపయోగిస్తారు.
ఇక్కడ ఫ్లష్ ట్యాంక్ లోని నీటిలో నీలి రంగులో ఉన్న ఒక లిక్విడ్ (Skykem) ను కలుపుతారు. ఫ్లష్ బటన్ నొక్కగానే ఈ నీలపు నీరు టాయిలెట్ ని శుభ్రపరుస్తుంది. వెంటనే వాక్యూమ్ సిస్టం ఆ వ్యర్థాలతో కలిసిఉన్న నీటిని లాగేసుకుంటుంది. ఒకవేళ వాక్యూమ్ సిస్టం బదులు నీటిని ఉపయోగిస్తే అది వ్యర్దాల ట్యాంక్ లోకి వెళ్తుంది. సమస్య ఎక్కడ వస్తుందంటే విమానం టేకాఫ్, లాండింగ్ సమయంలో ఎక్కువ ఆక్సిలేరేషన్, డిసలేరషన్ ఫోర్స్ వలన ట్యాంక్ లో ఎక్కువ స్లోషింగ్ జరిగి జాయింట్ల నుండి వ్యర్దాలు లీక్ అయ్యే అవకాశం ఉంది. అందుకే వాక్యూమ్ సిస్టం, లిక్విడ్ ను ఉపయోగిస్తారు. Skykem వలన శుభ్రపరచడానికి తక్కువ నీరు సరిపోతుంది. టాయిలెట్ సీట్ శుభ్రంగా ఉండడమే కాకా, తక్కువ నీరు ఉపయోగిస్తుంది కాబట్టి స్లోషింగ్ కూడా తక్కువగానే ఉంటుంది. తద్వారా లీక్ అయే అవకాశాలు తగ్గుతాయి.
విమానం ఎక్కువ ఎత్తులో ఎగురుతున్నప్పుడు ఉష్ణం తగ్గి వ్యర్దాలు గడ్డ కట్టుకుంటాయి. తిరిగి విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఉష్ణం పెరిగి అది తిరిగి ద్రవ రూపంలోకి మారుతుంది. కొన్ని ప్రదేశాల్లో లాండింగ్ జనావాసాల మీదుగా జరిగుతుంది కాబట్టి లీక్ ఏమైనా అయితే వ్యర్దాలు ఇళ్ల మీద పడే అవకాశం ఉంటుంది. అప్పుడే అనిపిస్తుంది విమానాలను ఆకాశంలోనే శుభ్రం చేసి వ్యర్దాలను క్రిందికి వదిలేస్తారా ఏంటి? అని.