Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

లేటు వ‌య‌స్సులో పెళ్లి చేసుకున్నారా.. అయితే ఇవి పాటించండి..

Admin by Admin
May 19, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మారిన జీవనశైలితో చాలా మార్పులు వచ్చాయి. పెళ్లి విషయంలో కూడా ఇప్పుడు యువత అభిప్రాయం మారింది. మగవారితో సమానంగా ఆడవారు సైతం ఉద్యోగాలు చేయటం, ఆర్థికంగా వారు నిలదొక్కుకోవటం, డబ్బు సంపాదనలో పడి పెళ్లిని పక్కన పెడుతున్నారు. దీని కారణంగానే 30 ఏళ్లు వచ్చినా పెళ్లి గురించి ఆలోచించటం లేదు. బాగా స్థిరపడిన తరువాతే, లేటు వయస్సులో పెళ్లిపీటలు ఎక్కుతున్నారు నేటి మహిళలు. అయితే మూడు పదుల వయస్సులో పెళ్లి చేసుకున్నవారికి కొన్ని ఇబ్బందులు తప్పవని అంటున్నారు నిపుణులు. మరి ఆ ఇబ్బందులు ఏంటో, వాటి నుంచి ఏ విధంగా గట్టెక్కాలో తెలుసుకుందాం.

20-30 ఏళ్ల సమయంలో తన గురించి, తన కెరీర్‌ గురించి తప్పా కుటుంబంపై ఎవరికీ అంత ఏకాగ్రత ఉండదు. దీనికి మహిళలు ఏమీ అతీతులు కాదు. అప్పటి వరకు ఆఫీసు, సంపాదనపై ఉన్న మహిళ .. పెళ్లి కాగానే, కుటుంబంపై ఏకాగ్రత పెట్టలేరు. క్రమంగా అలవాటు అవుతుంది. అది కూడా, కుటుంబంపై క్రమంగా ఆసక్తి పెంచుకునేందుకు ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే. ఎక్కువ‌గా భార్యాభర్తలు ఇద్దరి వయస్సు 30 దాటిన తరువాత పెళ్లి చేసుకొని ఉంటే, సంతృప్తిగా వైవాహిక జీవితాన్ని ఆస్వాదించలేరని నిపుణులు చెప్తున్నారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలుకు వెళ్లటం, ఎప్పుడో ఇంటికి తిరిగి రావటం వల్ల.. ఒకరి గురించి మరొకరు తెలుసుకునే అవకాశం ఉండదు. దీనివల్ల ఇద్దరి మధ్యా మనస్పర్థలు ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంది. ఈ కారణంతోనే లేటు వయస్సులో పెళ్లి చేసుకున్నా.. చాలా త్వరగా విడాకులు తీసుకుంటున్నవారు ఎక్కువయ్యారు.

if you are getting late marriage then know this

మహిళలలో ముప్పై దాటాక, వారి శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. రుతుక్రమంలో మార్పులు రావటం వల్ల, పెళ్లి అనంతరం పిల్లలు పుట్టే అవకాశం తక్కువ. పైగా భార్యాభర్తలిద్దరూ సంపాదన‌ కోసం పరుగులు తీయటంలో బిజీబిజీగా గడపటంతో.. దంపతుల మధ్య ఏకాంతం చాలా తక్కువ‌గా ఉంటుంది. శృంగార జీవితాన్ని ఆస్వాదించకుండా.. యాంత్రికంగా చేస్తారని నిపుణులు తెలిపారు. దీని కారణంగానే మహిళలు అండం విడుదలయ్యే సమయంలో వీరు కలిసే అవకాశం తక్కువని అంటున్నారు. మరి ముప్ఫై దాటిని వారు తమ దాంపత్య జీవితాన్ని సుఖంగా గడపటానికి కొన్ని టిప్స్‌ చెప్తున్నారు నిపుణులు. ఈ చిట్కాలు పాటిస్తే.. కుటుంబంలో ఎటువంటి చింతా ఉండదని అంటున్నారు.

ఇద్దరూ ఉద్యోగాలు వెళ్లినట్లయితే, ఇద్దరూ వీకాఫ్‌ రోజులలో ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాటానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే ఇద్దరి ఇష్టాలు, అయిష్టాలు తెలుసుకోవటంతో మనస్పర్థలు రాకుండా ఉంటాయి. ఇంట్లో పనిని ఇద్దరూ షేర్‌ చేసుకోవటంతో, ఇబ్బందులే ఉండవు. పెళ్లి కాగానే పిల్లల గురించి ప్లాన్‌ చేసుకోవటం ఉత్తమం. ఈ వయస్సులో మిస్‌ కారేజ్‌ అయ్యే రిస్క్‌ ఎక్కువ. అందువల్లే నిపుణులు పిల్లల గురించి ప్లాన్‌ చేసుకోమని చెప్తున్నారు. సెక్స్‌ లైఫ్‌ను ఎంజాయ్‌ చేయండి. కొత్తకొత్త ప్రదేశాలకు వెళ్తూ ఉండటంతో మూడ్‌ ఛేంజ్‌ అవుతూ ఉంటుంది. యాంత్రికంగా ఉండకుండా, నవ్వుతూ, నవ్విస్తూ ఉండండి. ఆఫీసు విషయాలు ఇంటి వరకూ తీసుకురాకండి. కుటుంబ సభ్యులతో కలివిడిగా ఉండటం అలవాటు చేసుకోండి. వారాంతాల్లో, పండగల సమయంలో ఇరు కుటుంబ సభ్యులతో సరదాగా గడపండి. ఇవి పాటిస్తే.. లేటు వయస్సులో పెళ్లి అయినా.. దాంపత్య జీవితంలో సుఖంగా ఉండొచ్చు.

Tags: Marriage
Previous Post

మ‌హిళలు త‌మ అందాన్ని మ‌రింత పెంచుకోవాలంటే.. క‌చ్చితంగా పాటించాల్సిన బ్యూటీ టిప్స్ ఇవి..!

Next Post

ఒకప్పుడు ఈ 5 మంది ప్రముఖ హీరోయిన్లు…కానీ ఇప్పుడు ఎటువైపు వెళ్లారో తెలుసా..?

Related Posts

వినోదం

పాచువుమ్ అద్భుత విలక్కుమ్.. సామాన్య ప్ర‌జ‌ల జీవితాల‌కు ప్ర‌తిబింబిం ఈ సినిమా..

May 30, 2025
inspiration

ధోతి కట్టుకుంటే అవమానించారని. అదే వ్యాపారం చేసి వేల కోట్లు సంపాదించాడు.. ఈయన సక్సెస్ స్టోరీ ఇది..

May 30, 2025
food

పెరుగు లేకుండా పాలు ఎలా తోడు పెట్టాలి?

May 30, 2025
ఆధ్యాత్మికం

తిరుపతిలో భోజనం ఎక్కడ బాగుంటుంది?

May 29, 2025
international

దావూద్ ఇబ్ర‌హీంను భార‌త ఇంటెలిజెన్స్ అధికారులు చంప‌కుండా ఆపిన అదృశ్య శ‌క్తి ఎవ‌రు..?

May 29, 2025
హెల్త్ టిప్స్

ఈ సీజ‌న్ లో మీరు క‌చ్చితంగా నిమ్మ‌కాయ నీళ్ల‌ను తాగాలి.. ఎందుకంటే..?

May 29, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
హెల్త్ టిప్స్

ఒక చెంచా నెయ్యితో రోజును ప్రారంభిస్తే వారం రోజుల్లో జరిగే మిరాకిల్స్ ఇవే.. మీరు ఊహించి ఉండరు..

by Admin
May 23, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!