కొన్ని అనివార్య కారణాల వల్ల పెళ్లి వయసు దాటిపోయి 40లో చేసుకోవాలసి వస్తే ఎటువంటి సమస్యలు ఎదుర్కోవాలి? అంటే.. 40 సంవత్సరాల వయసు దాటింది. ఇంకా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారా లేక సందేహిస్తున్నారా. మీరు అబ్బాయి అయినా అమ్మాయి అయినా సమాధానం ఒక్కటే. ఇలా అంత వయసు వచ్చిన పెళ్లి కాకుండా ఉన్నారు అంటే మీ తల్లిదండ్రుల నిర్లక్ష్యం నీ చేతకానితనం. ఏ నిర్ణయం సరిగ్గా తీసుకోలేరు. ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తారు. అనుమానం పడతారు చేసుకుంటే ఏమవుతుంది అని భయపడతారు. ఈ లోపల పుణ్యకాలం అయిపోయింది. నేను ఒక ఉదాహరణ చెప్తా మా ఇంటి చుట్టుపక్కల ఒక విషయం. ఒక అమ్మాయి విషయం. అమ్మాయికి మొన్నే 39 వెళ్లి 40 వచ్చింది. బీఎస్సీ చదివింది స్కూల్ టీచర్ చేస్తుంది. ప్రతిదీ అనుమానం. చాదస్తం.
ప్రతి పెళ్లి సంబంధం లోనూ ఏదో ఒక తేడా చూస్తుంది. ఆ తేడాను పట్టుకుని పెళ్లి ఆపేస్తుంది వద్దు అంటుంది. కానీ ఎక్కడా చెడ్డ పని చేయదు ఎవర్ని ప్రేమించలేదు. ఇంటర్ క్యాస్ట్ దంపతులకు పుట్టింది. ఆవిడ తల్లి నాకు తెలుసు. ఏదైనా సంబంధం చూడండి అంది. చూస్తాను అన్నాను. అబ్బాయికి 42 ప్రస్తుతానికి అమెరికాలో ఉన్నాడు. మీరు చేసుకుంటాను అంటే మాట్లాడతాం అన్నాను. కానీ అబ్బాయికి రెండు సంవత్సరాల నాడు పెళ్లి అయింది. కానీ అమ్మాయి పొగరుబోతు గొడవలు. పెళ్లయిన ఆరు నెలలకే విడాకులు అయ్యాయి. మీకు అభ్యంతరం లేకపోతే మాట్లాడుతా అని చెప్పా. పాపం ఆ తల్లి కూతురికి చెప్పింది ఈ విషయం. నేను రెండో వివాహం చేసుకోను అంది. ఆ అమ్మాయి వదిలేసింది అందుకే. విడాకడాకులు తీసుకున్నారు అంటుంది. ఎక్కువ చాదస్తం అనుమానం ఇలాంటివి ఆమెలో ఎక్కువ ఉన్నాయి కానీ 40 సంవత్సరాలకు కూడా ఆమె అలా ఉండటం తప్పు.
ఇప్పుడు చెప్పండి. ఆమె పెళ్లి విషయంలో సొంత నిర్ణయం తీసుకోలేక పోతే ఎవరు పరిష్కరిస్తారు. ఆమెకు రెండో పెళ్లి వాడు మాత్రమే దొరుకుతాడు. పెళ్లి చేసుకోవాలి నాలో ఏ లోపం లేదు అనే ఆలోచన ఉంటే ఎంతో మంది ఉన్నారు మార్కెట్లో మ్యారేజ్ బ్యూరోలో. అందరూ తమ బయోడేటా ఇస్తారు చూసుకుని సెలెక్ట్ చేసుకోవాలి మాట్లాడుకోవాలి. పెళ్లి చేసుకోవాలి అని ఉండాలి కానీ వరుడు లేదా వధువు దొరకట్లేదని అనవద్దు. ప్రేమించే గుణం ఉండాలి. సర్దుకుపోవాలి. ఈజీగా జంట దొరుకుతుంది.