స్త్రీకి పురుషుడిపై, పురుషుడికి స్త్రీపై సహజంగానే ఆసక్తి కలుగుతుంది. ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది. అది వారిద్దరి మధ్య లింగ భేదం కారణంగా, ప్రకృతి ధర్మం కనుక అలా ఒకరిపై ఒకరికి ఆసక్తి ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు చెప్పబోయేది మాత్రం పురుషుడికి స్త్రీపై ఏర్పడే ఆసక్తి గురించి. అవును, అదే. స్త్రీలు చేసే పలు పనుల వల్ల వారిపై పురుషులకు ఆసక్తి ఏర్పడుతూ ఉంటుంది. మరి వారు ఎలాంటి పనులు చేస్తే పురుషులు వారిపై ఆసక్తి చూపిస్తారో తెలుసా..? అవే ఇప్పుడు తెలుసుకుందాం. స్త్రీలు ఇతరులపై చూపించే జాలికి పురుషులు వారి పట్ల ఆసక్తిని పెంచుకుంటారు. వారు ఎంత దయగా ఉన్నారో గమనిస్తారు. వారిలో ఉన్న మానవతా భావాన్ని పురుషులు పరిశీలిస్తారు.
కఠినతరమైన, క్లిష్టమైన సందర్భాల్లో, సంఘటనల్లో స్త్రీలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎలా ప్రవర్తిస్తారు అన్న విషయాలపై కూడా పురుషులు ఆసక్తిని కనబరుస్తారు. స్త్రీల గోర్ల పట్ల కూడా పరుషులు ఆసక్తిని ప్రదర్శిస్తారట తెలుసా..! వారి గోర్లు ఉన్న ఆకారం, స్టైల్, డిజైన్.. ఇలాంటి విషయాలను పురుషులు చూస్తారట. ఏయే సందర్భాల్లో స్త్రీలు ఎలాంటి భావాలను ప్రదర్శిస్తున్నారు అనే విషయాన్ని కూడా పురుషులు గమనిస్తారు. దాన్ని బట్టి ఆసక్తి లేదా అయిష్టతను పెంచుకుంటారు. బాగా ధనవంతులైన స్త్రీల పట్ల కూడా కొందరు పురుషులకు ఆసక్తి కలుగుతుంది. అలాంటి స్త్రీలు అందంగా లేకున్నా సరే వారంటే కొందరు పురుషులకు ఇష్టం ఏర్పడుతుంది. అది కేవలం ధనం వల్లే కావడం విశేషం.
వ్యక్తిత్వం, ఆత్మ విశ్వాసం మెండుగా ఉన్న స్త్రీలను పురుషులు ఇష్టపడుతారట. ఇతర స్త్రీల పట్ల మరికొందరు స్త్రీలు ఎలా ప్రవర్తిస్తున్నారు అనే విషయాన్ని కూడా కొందరు పురుషులు గమనిస్తారట. అలాగే వారి నిర్ణయాలు కూడా ఉంటాయి. స్త్రీలు ఎంత స్టైల్‌గా ఉన్నారు, ఫ్యాషన్‌గా ఉన్నారు అనే విషయాల పట్ల పురుషులు ఆసక్తిని కలిగి ఉంటారట. స్త్రీలు ధరించే పాదరక్షలను కూడా పురుషులు చూసి వారిపై ఒక అభిప్రాయానికి వస్తారట. అది ఆసక్తి కావచ్చు, అయిష్టత కావచ్చు. ఒక స్త్రీకి ఉన్న స్నేహితుల సంఖ్యను కూడా పురుషులు గమనించి వారిపై ఇష్టాన్ని పెంచుకుంటారట. కొందరు పురుషులకు బ్యాక్‌లెస్ దుస్తులు ధరించే స్త్రీలంటే ఇష్టంగా ఉంటుందట.
ఎప్పుడూ అందరినీ నవ్వుతూ నవ్విస్తూ ఉండే స్త్రీలను కొందరు పురుషులు ఇష్టపడతారు. ఎలాంటి భయానికి తావు లేకుండా నిర్భయంగా ఉండే స్త్రీలంటే కొందరు పురుషులు ఆసక్తిని ప్రదర్శిస్తారు. ఎన్ని గంటలు పనిచేసినా అలసి పోకుండా అలాగే కష్టింటే స్త్రీలను చూసి కొందరు పురుషులు ఇష్టపడతారు. పాజిటివ్‌గా ఉండడం, ఆలోచనాత్మక శక్తి ఉండడం, క్రియేటివ్‌గా ఆలోచించే స్త్రీలను కొందరు పురుషులు ఇష్టపడతారు. వారంటే ఆసక్తిని పెంచుకుంటారు.