Sleep : నిద్రించేటప్పుడు కలలు రావడం అనేది సహజం. దాదాపుగా ప్రతి ఒక్కరికీ నిత్యం కలలు వస్తుంటాయి. కొందరు పగటి పూటే కలలు కంటుంటారు. అయితే రాత్రి పూట చాలా మందికి పీడకలలు వస్తుంటాయి. ఆ కలల్లో ఒక్కోసారి ఎవరో వచ్చి ఛాతి మీద కూర్చున్నట్లు అనిపిస్తుంది. గొంతు పట్టుకున్నట్లు అవుతుంది. ఆ సమయంలో కాళ్లు, చేతులు కదిలిద్దామంటే కదలవు. మాటలు కూడా రావు. ఇలా చాలా మందికి జరుగుతుంటుంది. అయితే అసలు ఇంతకీ ఇలా ఎందుకు జరుగుతుంది ? దీన్ని ఏమంటారు ? ఇలా జరిగేందుకు ఏమైనా కారణాలు ఉంటాయా ? అంటే…
అర్థరాత్రి పూట గాఢ నిద్రలో ఉన్నప్పుడు లేదా తెల్లవారు జామున కొందరికి పీడకలలు వస్తుంటాయి. ఆ కలల్లో ఒక్కోసారి దెయ్యం ఏదో వచ్చి ఛాతి మీద కూర్చున్నట్లు అనిపిస్తుంది. ఆ సమయంలో ఎటూ కదలలేరు. మాటలు కూడా రావు. దీన్నే స్లీప్ పరాలసిస్ అంటారు. మనిషి సగటు ఆయుర్దాయం 75 ఏళ్లు అనుకుంటే ప్రతి ఒక్కరికీ ఇలాంటి కలలు ఎప్పుడో ఒకసారి వస్తుంటాయి. సాధారణంగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు లేదా నిద్ర లేచేటప్పుడు స్లీప్ పరాలిసిస్ సంభవిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఇక స్లీప్ పరాలిసిస్ వచ్చేందుకు ప్రత్యేకమైన కారణాలు ఏమీ లేవు. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో కూడా తెలియదు. కానీ ప్రతి వ్యక్తికి ఎప్పుడో ఒకసారి ఇలా జరుగుతుందని మాత్రం నిపుణులు చెబుతున్నారు. ఇక స్లీప్ పరాలిసిస్ స్థితి సుమారుగా 80 సెకన్ల వరకు ఉంటుంది. అమెరికాలో 1 శాతం మంది జనాభాకు ఏటా ఇలాంటి కలలు వస్తుంటాయని సర్వేలు చెబుతున్నాయి. స్లీప్ పరాలిసిస్ వచ్చిన వారు వెంటనే నిద్ర నుంచి మేల్కొంటారు. దెయ్యాలు అంటే భయం ఉన్నవారికి ఇలా జరుగుతుందని కొందరు చెబుతున్నారు. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో కచ్చితమైన కారణాలు మాత్రం ఇంకా తెలియవు..!