ఈ సంవత్సరం జూలైలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో ఆదాయపు పన్నుకు సంబంధించి కొన్ని రూల్స్ గురించి ప్రతిపాదించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్. ట్యాక్స్ కట్టే వాళ్ళు ఈ కొత్త రూల్స్ ని తప్పక తెలుసుకోవాలి .అక్టోబర్ 1 నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి. ట్యాక్స్ చెల్లింపుదారులు ఇక మీదట ఆధార్ నెంబర్ కి బదులుగా ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడిని ఇవ్వడానికి అవ్వదు. టాక్స్ పీయర్లు ఈ విషయాన్ని గమనించాలి. అలాగే ట్యాక్స్ డిటెక్టెడ్ సోర్స్ పన్ను రేట్లు మారాయి.
టీడీస్ రేటు ఐదు నుంచి రెండు శాతానికి తగ్గించింది కేంద్రం. 20% మేర TDS విధించేలా అవకాశాన్ని కల్పించే సెక్షన్ 194 ని తొలగించింది. చాలామంది ట్యాక్స్ పేయర్లకు ఎక్కువ లబ్ధి చేకూరుతుందని కేంద్రం చెప్పింది. కొత్త రూల్స్ ప్రకారం ఏప్రిల్ ఒకటి 2025 నుంచి రెంటల్ ఇన్కమ్ పన్నుకు లోబడి ఉంటుంది. ఇంటి యజమానులు కొన్ని డిడక్షన్స్ కి అర్హులు 30% వరకు ఆదా చేసుకోవడానికి అవుతుంది.
ఆస్తి యజమానుల మధ్య పన్ను ఎగవేతని నిరోధిస్తుంది. ఈ కొత్త నిర్ణయం వలన ఇల్లు అద్దెకు ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు. కొత్త రూల్స్ కట్టుబడి ఉండాలి. స్ట్రిక్ట్ టాక్స్ రూల్స్ ని ఫాలో చేసి ఇప్పటి నుంచి ఇల్లును అద్దెకు ఇవ్వాలి కాబట్టి ఈ విషయంలో కొంచెం ఇంటి యజమానులకు కష్టంగానే ఉంటుంది. వీటిని పక్కన పెడితే కొంత మినహాయింపులను మాత్రం భూస్వాములుకి కేంద్రం ఇచ్చింది.