కాలేజీ లైఫ్ అంటేనే సరదాగా ఉంటుంది. కాలేజీలో తరగతి గదుల్లో పాఠాలు వినడం కన్నా క్లాసులకు బంక్ కొట్టి బయట తిరగడం సరదా అనిపిస్తుంది. అలా చేయడం చాలా మందికి ఎంజాయ్‌గా ఉంటుంది. చాలా మంది ఇలా చేస్తారు కూడా. అంతెందుకు.. బాగా చదివే స్టూడెంట్స్ కూడా ఒక్కోసారి క్లాస్‌లకు బంక్ కొడతారు. ఇది సహజమే. అయితే.. ఏ విద్యార్థి క్లాస్‌కు బంక్ కొట్టినా మరుసటి రోజు తాను క్లాస్‌కు వచ్చాక ముందు రోజు ఎందుకు రాలేకపోయాడో క్లాస్ లెక్చరర్‌కు తగిన సమాధానం చెప్పాలి. ఇక్కడే చాలా మంది విద్యార్థులు దొరికిపోతారు. అయితే అలాంటి ఇబ్బంది లేకుండా కింద చెప్పిన విధంగా పలు సూచనలు పాటిస్తే క్లాస్‌లకు బంక్ కొట్టినా ఎంచక్కా లెక్చరర్ బారి నుంచి తప్పించుకోవచ్చు. మరి ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. క్లాస్‌కు ఎందుకు రాలేదు అని లెక్చరర్ అడిగితే.. అప్పుడు మీరు.. అవును సార్/మేడమ్. రాత్రి పూట నాకు ఓ కల వచ్చింది. అందులో నేను టెర్రరిస్టుగా కనిపించాను. క్లాసుల్లో తిరుగుతూ ఎదురుగా వచ్చిన వారిని కాల్చేస్తున్నా. అంతలో మీరొచ్చారు. ఎదురుగా గన్‌తో నేనున్నా. అంతలోనే కల చెదిరిపోయింది. సాధారణంగా తెల్లవారుజామున వచ్చిన కలలు నిజం అవుతాయంటారు కదా.. అది కూడా నిజమే అవుతుందనుకున్నా. అందుకే కాలేజీకి రాలేదు.. అని రీజన్ చెప్పండి. మీ లెక్చరర్ షాక్ అవకపోతే అప్పుడు అడగండి.
2. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే వారిని చూసుకోవడం కోసం రోజంతా ఇంట్లో ఉండాల్సి వచ్చిందని, పెద్దవారు పనుండి అర్జెంట్ గా బయటకు వెళ్లారని చెప్పండి. ఇలా చెబితే క్లాస్‌లకు బంక్ కొట్టినా ఏమీ కాదు.
3. మీ ఫ్రెండ్ లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నాడని, బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి కాలేజీ ఎగ్గొట్టాల్సి వచ్చిందని లెక్చరర్‌కు చెప్పండి. కన్విన్స్ అవుతారు.
4. ఇంట్లో ఆర్థిక సమస్యలున్నాయని, పార్ట్ టైం జాబ్ కోసం వెదుకుతున్నానని, అందుకే కాలేజీకి రాలేకపోయానని చెప్పండి. లెక్చరర్ నమ్ముతారు.
5. మీ సొంత అక్క లేదా చెల్లెలు కోసం సంబంధాలు వెతికే పనిలో పెద్దలతో వెళ్లానని చెబితే క్లాసులకు ఎగనామం పెట్టినా లెక్చరర్లు ఏమీ అనలేరు.
6. మీరు మీ ఫ్రెండ్ రెండు స్పోర్ట్స్ జట్ల మధ్య బెట్టింగ్ పెట్టుకున్నామని, ఫ్రెండ్ ఓడిపోయాడని, కనుక అతను కాలేజీకి వచ్చాడని, తాను గెలిచానని, కనుక కాలేజీకి రాలేదని చెప్పి తప్పించుకోండి.
7. వేరే ఫ్రెండ్ బలవంతంగా కాలేజీకి బంక్ కొట్టించాడని, తనకు అసలు అలా బంక్ కొట్టడం ఇష్టం లేదని, క్లాస్‌లకు అటెండ్ అవ్వాలని మనస్సులో ఉన్నా ఫ్రెండ్ వల్ల కాలేజీకి బంక్ కొట్టాల్సి వచ్చిందని చెబితే లెక్చరర్లు నమ్ముతారు.
8. టీవీ వారు నిర్వహించే స్పెషల్ కార్యక్రమం, ఆడిషన్స్ తదితర కార్యక్రమాలకు హాజరయ్యానని, కనుకే క్లాస్‌లకు బంక్ కొట్టాల్సి వచ్చిందని చెప్పండి. లెక్చరర్లు నమ్మేస్తారు.