వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అపురూపమైన మరపురాని ఘట్టం గా నిలిచిపోతుంది. వివాహానికి ముందు అమ్మాయిలు అబ్బాయిలు వారికి కాబోయే జీవిత భాగస్వామి ఎలా ఉండాలనేది కలలు కంటూ ఉంటారు. ముఖ్యంగా వివాహానికి సంబంధించి అబ్బాయిల్లో అమ్మాయిలు ఖచ్చితంగా చూడవలసిన కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. అవి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. 1.అస్తమానం ఏదో ఒక కండిషన్ పెట్టే యువకులను యువతులు అస్సలు పెళ్లి చేసుకోరాదట. దానివల్ల అనేక ఇబ్బందులు వస్తాయని అది ఎక్కడికైనా దారితీయవచ్చని అంటున్నారు. 2. జంతువులని హింసించే లేదా జంతువులంటే ఇష్టం లేని యువకులను వివాహం చేసుకోకూడదట. ఎందుకంటే జంతువుల లాగే తను పెళ్లి చేసుకున్న భార్యను కూడా హింసిస్తారు అని నిపుణులు అంటున్నారు.
3. ఎవరితోనైనా ఉన్న సంబంధాన్ని ఊరికే తెగతెంపులు చేసుకునే యువకులను యువతులు పెళ్లి చేసుకోరాదట. సంబంధ బాంధవ్యాల విలువ లేకపోతే భార్యను కూడా అంతే తేలికగా తీసుకుంటారని దీనివల్ల డైవర్స్ ఇచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. 4. అలాగే ఏదైనా మాట ఇచ్చి తప్పే యువకులను కూడా యువతులు పెళ్లి చేసుకోరాదు. ఎందుకంటే ఇలాంటి వారిని నమ్మడం చాలా కష్టం. వారితో బంధం అనేది నిలబడదు. 5. కట్టుకోబోయే భార్యకు కాకుండా ఇతరులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే వారిని యువతులు పెళ్ళాడరాదట. ఎందుకంటే వారు భార్యను అంత ప్రేమగా చూసుకోరని నిపుణులు అంటున్నారు.
6. ఏ విషయంలోనైనా సరైన నిర్ణయం తీసుకోలేని యువకులను యువతులు పెళ్లి చేసుకో రాదట. ఎందుకంటే వీరికి పెళ్లి చేసుకున్న తర్వాత తాము తప్పుడు నిర్ణయం తీసుకున్నామనే భావన కలుగుతుందని అంటున్నారు. 7. ఏదైనా తప్పు జరిగినప్పుడు అవతలివారిని క్షమించమని అడుగుతాం. కానీ కొంతమంది యువకులు అవసరానికి మించి సారీలు చెబుతూ ఉంటారు వారిని పెళ్లి చేసుకో రాదని అంటున్నారు. 8. ఎదుటి వారు చెప్పేది అర్థం చేసుకోకుండా చీటికిమాటికి ఇతరులతో గొడవపడే యువకులను కూడా పెళ్లి చేసుకోరాదని అంటున్నారు. వీరి వల్ల ఇబ్బందులు తలెత్తుతాయట.