శృంగారంలో పాల్గొనడం అనేది ప్రకృతి ధర్మం. దంపతులిద్దరూ కలిసిపోయే ప్రకృతి కార్యం. దాని గురించి మాట్లాడుకునేటప్పుడు సిగ్గు పడాల్సిన పనిలేదు. అయితే శృంగారంలో తరచూ పాల్గొంటే మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుందని వైద్య నిపుణులు చెబుతుంటారు. కానీ అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లుగా దేన్నీ అతిగా తీసుకోరాదు. అతిగా చేయరాదు. ఆ సూత్రం శృంగారానికి కూడా వర్తిస్తుంది. అతిగా శృంగారం చేస్తే కొన్ని సమస్యలు కూడా వస్తాయి. అదేమిటంటే..
శృంగారం అతిగా చేయడం వల్ల స్త్రీ, పురుషులు ఇరువురిలోనూ మూత్రాశయ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అతిగా శృంగారం వల్ల కొంత కాలానికి అందులో ఆసక్తి సన్నగిల్లుతుంది. శృంగారం అంటేనే విరక్తి ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది. దంపతులిద్దరిలో ఎవరైనా ఒకరు అతిగా శృంగారం చేయమని ఫోర్స్ చేస్తే ఇంకొకరికి తీవ్రమైన ఇబ్బందులు కలుగుతాయి. మానసికంగా కుంగి పోతారు. దీంతో ఇద్దరూ విడిపోయేందుకు కూడా అది కారణమవుతుంది.
అయితే శృంగారం అతిగా చేస్తే బట్టతల వస్తుందని, హార్ట్ ఎటాక్‌లు వస్తాయని.. కొందరు నమ్ముతుంటారు. కానీ అందులో నిజం లేదు. అంటే.. కొంత వరకు సత్యం ఉంది.
సాధారణంగా పురుషుల్లో టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ రోజూ డై హైడ్రోటెస్టోస్టిరాన్‌గా మారుతుంది. ఇది పురుషులకు పురుష లక్షణాలు ఉండేలా చేస్తుంది. సరాసరి రోజుకు టెస్టోస్టిరాన్ లో 10 శాతం డై హైడ్రోటెస్టోస్టిరాన్ గా మారుతుంది. అయితే ఇది వ్యక్తులను బట్టి మారుతుంది.
టెస్టోస్టిరాన్ ఎక్కువగా ఉన్నవారిలో డై హైడ్రోటెస్టోస్టిరాన్ కూడా ఎక్కువగానే ఉత్పత్తి అవుతుంది. అలాంటి వారిలో జుట్టుకు పోషణ లభించదు. దీంతో వారికి బట్టతల వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. ఇక డై హైడ్రోటెస్టోస్టిరాన్ ఎక్కువగా ఉండడం వల్ల గాయాలు నెమ్మదిగా మానుతాయి. ప్రోస్టేట్ గ్రంథి వాపులకు గురవుతుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. గుండె జబ్బులు కూడా రావచ్చు. కానీ.. డై హైడ్రోటెస్టోస్టిరాన్ కు, అతిగా శృంగారం చేసేందుకు సంబంధం లేదు.
టెస్టోస్టిరాన్ స్థాయిలు సాధారణంగా ఉన్నవారు కూడా కొందరు అతిగా శృంగారం చేస్తారు. కానీ దాంతో బట్టతల రాదు. కానీ టెస్టోస్టిరాన్ ఎక్కువగా ఉంటే డై హైడ్రోటెస్టోస్టిరాన్ కూడా ఎక్కువగానే ఉత్పత్తి అవుతుంది. కనుక అలాంటి వారికి జుట్టు రాలిపోయి బట్టతల వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. ఇది సైంటిస్టుల పరిశోధనల్లో తేలింది.
ఇక అతిగా శృంగారం చేస్తే హార్ట్ ఎటాక్‌లు వస్తాయన్న మాట కూడా నిజమే. ఈ విషయాన్ని కూడా సైంటిస్టులు వెల్లడించారు. కానీ ఇది చాలా అరుదుగా జరుగుతుంది. ఎక్కడో ఒక్కరికి అలా జరుగుతుంది. కానీ అందరికీ జరుగుతుందని చెప్పలేం. అందువల్ల అతి శృంగారం పనికిరాదు. ఆరోగ్యకరమైన రీతిలో శృంగారం చేయాల్సి ఉంటుంది. రోజుకు 3 సార్ల వరకు శృంగారంలో పాల్గొనడం ఆరోగ్యకరం అని సైంటిస్టులు చెబుతున్నారు. కనుక అంతకు మించకుండా చూసుకుంటే చాలు, ఆరోగ్యంగా ఉండవచ్చు.