మన జీర్ణవ్యవస్థలో కొన్ని కోట్ల సంఖ్యలో బాక్టీరియా ఉంటాయి. వీటిలో మంచి బాక్టీరియా, చెడు బాక్టీరియా అని రెండు రకాలు ఉంటాయి. అయితే మంచి బాక్టీరియా మనకు మేలు చేస్తుంది. ఇవి శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా, స్థూలకాయం రాకుండా చూస్తాయి. డయాబెటిస్, గుండె జబ్బులు, వాపులు, ఆటో ఇమ్యూన్ వ్యాధులు రాకుండా చూస్తాయి. అలాగే జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తాయి. అందువల్ల జీర్ణవ్యవస్థలో ఉండే మంచి బాక్టీరియాను మనం పెంచుకోవాలి. అందుకు గాను కింద తెలిపిన ఆహారాలను రోజూ తీసుకోవాలి.
1. ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల జీర్ణాశయంలో మంచి బాక్టీరియా పెరుగుతుంది. కూరగాయలు, ఆకుకూరలు, నట్స్, విత్తనాల్లో మనకు ఫైబర్ అధికంగా లభిస్తుంది. దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వాపులు తగ్గుతాయి.
2. ఉల్లిపాయలు, వెల్లుల్లి, తృణ ధాన్యాలు, పండ్లు, ఓట్స్, సోయాబీన్స్ వంటి ప్రీ బయోటిక్ రిచ్ ఆహారాలను తింటున్నా జీర్ణాశయంలో మంచి బాక్టీరియా పెరుగుతుంది.
3. పులియబెట్టబడిన ఆహారాలను తింటే మంచి బాక్టీరియా పెరుగుతుంది. ఇడ్లీ, దోశ వంటివి ఈ కోవకు చెందుతాయి.
4. కొవ్వు పదార్థాలను, మాంసాహారాలను, నూనె పదార్థాలను, జంక్ ఫుడ్‌ను ఎక్కువగా తినరాదు. వీటితో మంచి బాక్టీరియా నశిస్తుంది. కనుక వీటిని పరిమిత మోతాదులోనే తినాలి.
5. యాంటీ బయోటిక్స్ ను అధికంగా వాడినా మంచి బాక్టీరియా నశిస్తుంది. కనుక డాక్టర్ల సూచన మేరకు మాత్రమే వాటిని వాడుకోవాలి. దీంతో మంచి బాక్టీరియాను రక్షించుకోవచ్చు.
6. రోజూ వ్యాయామం చేయడం, తగినన్ని గంటల పాటు నిద్రించడం, తగినంత నీరు తాగడం, రోజూ పౌష్టికాహారం తీసుకోవడం.. వంటివి చేస్తుంటే మంచి బాక్టీరియా పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటాము.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365