Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వైద్య విజ్ఞానం

ట్రాన్స్‌జెండర్లు ఎలా పుడతారు.. వీరి పుట్టుకకు అసలు కారణం ఇదే..!

Admin by Admin
February 12, 2025
in వైద్య విజ్ఞానం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

అసలు ట్రాన్స్‌జెండర్లు ఎలా పుడతారు. వీరి పుట్టుకకు అసలు కారణం ఏంటి. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ట్రాన్స్‌జెండర్లకు జీవనోపాధిని కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం రీసెంట్‌గా కీలక నిర్ణయం తీసుకుంది. అర్హతలు ఉన్న కొంతమందిని ఎంపిక చేసి, వారికి ట్రాఫిక్ వాలంటీర్స్‌గా ఉద్యోగాలు ఇచ్చింది. దీంతోపాటు వీరి సంక్షేమం, అభివృద్ధి కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అంతేకాదు ప్రతి జిల్లాలోని ఏరియా ఆసుపత్రుల్లో వారానికి రెండు రోజులు ట్రాన్స్‌జెండర్లకు వైద్యచికిత్స, స్క్రీనింగ్‌ వంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇలా కొద్దిరోజుల నుంచి థర్డ్ జెండర్ పర్సన్స్ గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతోంది. అయితే చాలామందికి అసలు ట్రాన్స్‌జెండర్లు ఎలా పుడతారు.. అనే డౌట్ ఉంటుంది. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా ప్రకృతి సిద్ధమైన లింగాలు రెండు (ఆడ, మగ) ఉంటాయి. అయితే మూడో తరగతి వారిని కూడా ప్రకృతి ప్రసాదించినట్లుగా ట్రీట్ చేస్తున్నారు. ఇలా జన్మించిన వారిని హిజ్రాలుగా పిలుస్తారు. సైన్స్ ప్రకారం చూస్తే.. ఆడవారిలో రెండు X క్రోమోజోములు ఉంటాయి. మగవారిలో అయితే ఒక X, ఒక Y క్రోమోజోమ్‌ ఉంటుంది. స్త్రీలోని X క్రోమోజోమ్, పురుషుడి Y క్రోమోజోమ్‌తో కలిస్తే మగ పిండం ఏర్పడుతుంది. అదే స్త్రీలోని X క్రోమోజోమ్‌తో పురుషుడిలోని X క్రోమోజోమ్‌ కలిస్తే ఆడపిండం ఏర్పడుతుంది. దీంతో పుట్టబోయే పిల్లల లింగ నిర్ధారణ జరుగుతుంది. అయితే ఈ ప్రాసెస్‌లో స్త్రీలోని రెండు X క్రోమోజోమ్స్ లేదా పురుషుడిలోని X, Y క్రోమోజోమ్‌లలో ఏదైనా లోపాలు, రుగ్మతలు ఉండొద్దు. ఇలా ఉంటే అటు ఆడ, ఇటు మగ పిండం ఏర్పడకుండా థర్డ్ జెండర్ పిండం ఏర్పడే అవకాశం ఉంటుంది.

do you know how transgenders are born

ట్రాన్స్‌జెండర్ చిన్నారుల పుట్టుక వెనుక అసలు కారణం తెలుసుకోవడానికి ఇప్పటికే ఎన్నో పరిశోధనలు జరిగాయి. సైన్స్‌ ప్రకారం చూస్తే, దీనికి మెటబాలిక్ డిజార్డర్ ప్రధాన కారణంగా కనిపిస్తోంది. కాంజెనిటల్ అడ్రినల్ హైపర్‌ప్లాసియా అని పిలువబడే అసాధారణ క్రోమోజోమ్స్ వల్ల ఈ మెటబాలిక్ డిజార్డర్ వస్తుంది. దీని ఫలితంగా ట్రాన్స్‌జెండర్ చైల్డ్ పుట్టొచ్చు. అయితే క్రోమోజోమ్స్ అలా అసాధారణంగా మారడానికి కారణాలు, మెటబాలిక్ డిజార్డర్ గురించి నేటికీ శాస్త్రీయ ఆధారాలు లేవు. జన్యుపరమైన రుగ్మతల కారణంగా కూడా ఇలా జరుగుతుండొచ్చని పరిశోధకులు భావిస్తుంటారు. జెనిటిక్ డిజార్డర్ వల్ల సెక్స్ క్రోమోజోమ్స్ మిస్ అవుతాయి. ఫలితంగా, క్రోమోజోమ్స్ ఫలదీకరణం నిర్దిష్టంగా జరగక ట్రాన్స్‌జెండర్ చిన్నారులు పుడతారు.

గర్భం దాల్చిన తొలి రోజుల్లోనే మగ, ఆడ పిండానికి చెందిన జననేంద్రియాలు ఒకే కణజాలం నుంచి ఏర్పడతాయి. ఈ సమయంలో పురుష పునరుత్పత్తి కణజాలంలో టెస్టోస్టిరాన్ హార్మోన్ విడుదల ఎక్కువగా ఉంటేనే పురుషాంగం స్పష్టంగా ఏర్పడుతుంది. అయితే బీజావయం, పీనైల్ యురెత్రా కలిసి ఆడ శిశువుని వృద్ధి చెందిస్తాయి. ట్రాన్స్‌జెండర్ శిశువులో ఈ ప్రాసెస్ పూర్తిగా డిస్టర్బ్ అవుతుంది. ఫలితంగా, జననేంద్రియాల ఏర్పాటు స్పష్టంగా ఉండదు. పురుష పునరుత్పత్తి అవయవం పూర్తిగా అభివృద్ధి చెందక టెస్టోస్టిరాన్ హార్మోన్ లోటు ఏర్పడుతుంది. ఫలితంగా, స్వల్ప సైజు పురుషాంగం, వృషణాలతో చిన్నారులు పుడతారు.

Tags: transgenders
Previous Post

చివ‌రి రోజుల్లో రాజ‌నాల అంత దుర్భర ప‌రిస్థితిని అనుభ‌వించారా..?

Next Post

నుదుటన కుంకుమను ఎందుకు ధరిస్తారో తెలుసా?

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.