Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వైద్య విజ్ఞానం

దెబ్బ త‌గిలిన చోట ఐస్ క్యూబ్స్ పెడుతున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి..

Admin by Admin
April 23, 2025
in వైద్య విజ్ఞానం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

చాలా మంది దెబ్బ తగలగానే ముందుగా చాలా సులువైన పద్దతి అయిన ఐస్ ప్యాక్ ని విరుగుడుగా భావించి వాడేస్తుంటారు. అలా వాడటం వల్ల నొప్పి త్వరగా తగ్గిపోతుందని అనుకుంటారు. కానీ దెబ్బలు తగిలినప్పుడు ఐస్ వాడటం మంచిది కాదని అధ్యయనాలు చెబుతున్నాయి. అసలు ఐస్ అనేది నిజంగా ఎలా పనిచేస్తుంది ? ఐస్ వాడటం వల్ల దెబ్బ తగిలిన చోట మనకు నొప్పి తాత్కాలికంగా కొన్ని నిమిషాలపాటు తగ్గినట్లు అనిపిస్తుంది, సాధారణంగా గాయం నయమయ్యే ప్రక్రియలో జోక్యం చేసుకుంటుంది. ఆ ప్రాంతాన్ని కొద్దీ సేపు తిమ్మిరెక్కిస్తుంది. .అంతే..కానీ దెబ్బను తగ్గించడంలో ఎటువంటి సహాయం చేయదు సరికదా..ఇంకా దెబ్బ తగ్గడానికి పట్టే సమయాన్ని పెంచుతుంది..అదెలాగో తెలుసుకోండి..

అసలు ఐస్ అనేది గాయానికి ఏమి చేస్తుంది ? శోషరస ద్రవాలు ప్రవాహాన్ని ఐస్ అడ్డుకుంటుంది. దీని వల్ల మనకు దెబ్బ నయమయ్యే సమయం మరింత పెరుగుతుంది.కండరాల మధ్య సమన్వయాన్ని, వేగంతో కూడిన బలాన్ని ఐస్ తగ్గిస్తుంది. ఇందు వల్ల మన కండరాల కదలిక తగ్గిపోతుంది.కణాల సంకేతవ్యవస్థ లో ఐస్ జ్యోక్యం చేసుకుంటుంది. అందు వల్ల దెబ్బ తగిలిన భాగంలో కణాలు అంత త్వరగా వృద్ధి చెందకుండా అడ్డుకుంటుంది. ఇందు వల్ల ఆ భాగం నయం అవ్వడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది.

if you are putting ice pack on wound then know this

దెబ్బ తగిలినప్పుడు నిజానికి మంట రావడం అనేది, ఆ దెబ్బ నయమయ్యే భాగంలో మొదలయ్యే మొదటి ప్రక్రియ. దెబ్బ తగిలిన చోట కణజాలాన్ని మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావాలంటే మంట అనేది ఖచ్చితంగా రావాలి. కానీ మనం ఎప్పుడైతే ఐస్ ని వాడతామో అప్పుడు అది మంటను రాకుండా అడ్డుకుంటుంది.ఎప్పుడైతే దెబ్బ తగిలిన చోట మంట వస్తుందో అప్పుడు అక్కడ కణజాలాన్ని మేల్కొల్పడంలో మంట ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. నిద్రావస్థలో ఉన్న కణాలు కూడా దెబ్బను నయం చేయడానికి పని మొదలు పెడతాయి. సాధారణంగా జరిగిపోయే ఈ నయమయ్యే ప్రక్రియకు ఐస్ వాడకం అనేది పెద్ద అవరోధం గా నిలుస్తుంది. ఎప్పుడు అయితే మనకు దెబ్బ తగులుతుందో అప్పుడు ఆ ప్రదేశంలో రక్త నాళాలను పెద్దవిగా చేస్తుంది మన శరీరం. అందువల్లనే ఆ ప్రదేశం లో వాపు వస్తుంది.ఆ సమయంలో ఆ ప్రాంతంలో రక్త‌ ప్రసరణ అధికమవుతుంది. రక్త ప్రసరణ ఎక్కువైనప్పుడు కొన్ని ప్రొటీన్ల తో పాటు, కొన్ని రసాయనాలు దెబ్బ తగిలిన ప్రాంతానికి చేరుకుంటాయి. దీనితో అక్కడ నయం చేసే ప్రక్రియ ప్రారంభం అవుతుంది. కానీ ఎప్పుడైతే ఐస్ వాడతామో ఈ మొత్తం ప్రక్రియకు విఘాతం కలుగుతుంది.

అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే మీరు తాత్కాలికం గా నొప్పిని తాగ్గించుకోవడానికి ఐస్ ని వాడండి. ఆ తర్వాత ఖచ్చితంగా వైద్య సహాయాన్ని తీనుకోండి.

Tags: ice packwound
Previous Post

రోజూ ఉదయాన్నే ఉప్పు నీటిని తాగితే ఎంతో మంచిదట… ఎందుకో తెలుసుకోండి..!

Next Post

టూత్ బ్రష్ తో మీ ముక్కుపై రబ్ చేసి చూడండి. రిజల్ట్ చూసి షాక్ అవుతారు.!

Related Posts

ఆధ్యాత్మికం

మ‌న‌కి మంచి రోజులు వ‌చ్చాయ‌ని ఎలా తెలుస్తుంది..?

July 5, 2025
ఆధ్యాత్మికం

ఈ రాశుల‌కు చెందిన వారు ఎట్టి ప‌రిస్థితిలోనూ తాబేలు ఉంగ‌రాన్ని ధ‌రించ‌కూడ‌దు..!

July 5, 2025
ఆధ్యాత్మికం

శివుడికి మీరు వీటితో అభిషేకం చేస్తే.. ఏం కోరుకున్నా నెర‌వేరుతుంది..!

July 5, 2025
lifestyle

ఒంటరిగా ఉన్నప్పుడు నా భార్య ఫోర్స్ చేస్తోంది.. అలా ఉందామంటూ..!!

July 5, 2025
వినోదం

సర్కారు వారి పాటలో ఈ మిస్టేక్ ను గమనించారా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అబ్బా!

July 5, 2025
వినోదం

శ్రీమంతుడు నుంచి బలగం కథలు దొంగలించారంటూ..! వివాదాస్పదంగా నిలిచిన 10 సినిమాలు ఇవేనా ?

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.