Dimples : పుట్టుకతోనే సహజంగానే కొందరికి శరీరంలో కొన్ని ఆకృతులు వస్తుంటాయి. వాటిల్లో సొట్ట బుగ్గలు కూడా ఒకటి. సొట్ట బుగ్గలు ఉన్నవారు సహజంగానే అందంగా కనిపిస్తారు. యవ్వనంలో ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే సొట్ట బుగ్గల గురించి ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. సొట్ట బుగ్గలు ఉండడం మంచిదే అని.. వాటితో లక్ కలసి వస్తుందని.. కొందరు నమ్ముతారు. అయితే కొందరు మాత్రం ఇవి హానికరమని అంటుంటారు. ఈ క్రమంలోనే సైంటిస్టులు ఏమని చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా కొందరికి పుట్టినప్పుడే బుగ్గల కింద ఉండే కొన్ని కండరాల వల్ల సొట్ట బుగ్గలు ఏర్పడుతాయి. కండరాలు ఆ ప్రదేశంలో లోపలికి వెళ్తాయి. కొన్ని సార్లు అక్కడి కండరాలు రెండుగా విభజించబడతాయి. అందువల్ల సొట్ట బుగ్గలు ఏర్పడుతాయి. అయితే పెద్దయ్యే కొద్దీ కొందరికి సొట్ట బుగ్గలు అదృశ్యమవుతాయి. కానీ కొందరికి మాత్రం అవి అలాగే ఉంటాయి. ఇక కొందరికి సొట్ట బుగ్గలు కేవలం ఒకే బుగ్గపై ఉంటాయి. అయితే ఇవి ఎందుకు ఏర్పడుతాయి అనే విషయాన్ని మాత్రం సైంటిస్టులు ఇప్పటి వరకు ఇంకా నిర్దారించలేదు.

సాధారణంగా జన్యు పరమైన లోపాలు లేదా వంశ పారంపర్యంగా కూడా సొట్ట బుగ్గలు ఏర్పడుతాయని సైంటిస్టులు అంటున్నారు. కానీ ఇంత వరకు ఇందుకు సరైన ఆధారాలను కనిపెట్టలేకపోయారు. ఇక సొట్ట బుగ్గలను క్రియేట్ చేసే యంత్రాలు కూడా వచ్చాయి. కానీ వాటిని ఉపయోగించడం ప్రాణాలకే ప్రమాదం అని తేల్చారు. అందువల్ల వాటిని ఇప్పుడు చాలా వరకు వాడడం లేదు. ఇక సొట్ట బుగ్గలు ఉన్న చాలా మంది వ్యక్తులు సక్సెస్ ఫుల్ వ్యక్తులుగా నిలిచారు. జీవితంలో వారు ఎన్నో విజయాలను సాధించారు. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖ వ్యక్తులుగా పేరుగాంచారు. అందువల్ల సొట్ట బుగ్గలు ఉండడం అనేది అదృష్టానికి ప్రతీక అని 1900లలో కొందరు పరిశోధకులు తేల్చారు.
సొట్ట బుగ్గలు ఉంటే లక్ కలసి వస్తుందని జ్యోతిష్యం కూడా చెబుతోంది. అయితే సొట్ట బుగ్గలు ఉన్న అందరూ సక్సెస్ అవ్వాలని ఏమీ లేదు. కానీ ఇలా ఉన్నవారిలో చాలా మంది సక్సెస్ అయ్యారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక సొట్ట బుగ్గలు ఉండడం అనేది అత్యంత సహజసిద్ధమైందని.. ఇవి ఉండడం వల్ల మనకు ఎలాంటి హాని కలగదని నిపుణులు చెబుతున్నారు. అలాగే సాధారణ వ్యక్తుల కన్నా సొట్ట బుగ్గలు ఉన్నవారు వయస్సులో చిన్నవారిగా కనిపిస్తారట. ఇలా సొట్టబుగ్గలు ఉండేవారికి కొన్ని క్వాలిటీస్ ఉంటాయని చెబుతున్నారు. అయితే ఇవి ఉంటే ఎలాంటి హాని జరగదని.. హాని జరుగుతుందని అనుకుంటే అది పొరపాటేనని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి సొట్ట బుగ్గలు ఉన్నవారు వాటి గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు.