Lunula : మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి. వాటిని మనం అంతగా గమనించము. తీరా ఆ విషయం తెలిసాక ఆశ్చర్యపోతూ ఉంటాము. అలాంటి వాటిల్లో చేతి గోర్ల పై ఉండే తెల్లటి మచ్చలు ఒకటి. వీటిని గోర్లపై చాలా మంది గమనించే ఉంటారు. ఈ తెల్లటి మచ్చలను శాస్త్రీయంగా లునూలా అని పిలుస్తారు. వీటిని మన శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలుగా చెప్పవచ్చు. లాటిన్ భాషల్లో లునూలా అనగా చంద్రవంక అని అర్థం. ఇది ఎక్కువగా బొటన వేలు వేలిపై కనిపిస్తుంది. ఈ లునూలా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గోర్లపై ఉండే లునూలా కనుక దెబ్బతింటే మన చేతి గోర్లు పెరగడం ఆగిపోతాయి. మన విషయం మనలో చాలా మందికి తెలిసి ఉండదు. అలాగే ఈ లునూలా పెరిగే తీరును, మన గోరు రంగును బట్టి మన శరీరంలో ఉండే అనారోగ్య సమస్యల గురించి కూడా తెలుసుకోవచ్చు. బొటన వేలుపై లునూలా అసలు లేకపోతే రక్తహీనత, పౌష్టికాహారం, డిఫ్రెషన్ వంటి సమస్యలతో బాధపడుతున్నట్టు అర్థం. అదే విధంగా లునూలా కనుక నీలం లేదా పూర్తిగా తెలుపు రంగులో పాలిపోయినట్టు ఉంటే డయాబెటిస్ రాబోతుందని అర్థం చేసుకోవాలి. ఒకవేళ లునూలాపై ఎర్రటి మచ్చలు ఉంటే గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని అర్థం.
అదే విధంగా లునూలా ఆకారం మరీ చిన్నగా గుర్తు పట్టలేనట్టుగా ఉంటే అజీర్తి సమస్యతో బాధపడుతున్నట్టు అర్థం. అలాగే మనం తీసుకునే మందులు, యాంటీ బయాటిక్ ల కారణంగా లునూలా పసుపు రంగులో మారిపోతుంది. అదే విధంగా ఫ్లోరిడ్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల లునూలా నల్లగా లేదా బ్రౌ కలర్ లో మారిపోతుంది. అలాగే శరీరంలో మలినాలు, విష పదార్థాలు పేరుకుపోయినా కూడా లునూలా ఆకారం చిన్నగా ఉంటుంది. కనుక చేతి గోర్లపై ఉండే ఈ లునూలాను గమనించి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం చాలా అవసరం.