Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వార్త‌లు

Covid 19 Anti Body Test : అసలు కోవిడ్‌ 19 యాంటీ బాడీ టెస్టు అంటే ఏమిటి ? దీన్ని ఎవరు చేయించుకోవాలి ?

Admin by Admin
December 24, 2021
in వార్త‌లు, వైద్య విజ్ఞానం
Share on FacebookShare on Twitter

Covid 19 Anti Body Test : గత రెండేళ్ల నుంచి కరోనా వైరస్‌ ప్రపంచంపై దాడి చేస్తూనే ఉంది. అనేక వేరియెంట్ల రూపంలో మార్పులు చెంది.. పెద్ద ఎత్తున ప్రజలకు సోకింది. దీంతో కొన్ని కోట్ల మంది కరోనా కారణంగా అసువులు బాసిపోయారు. అయినప్పటికీ ఈ మహమ్మారి ప్రభావం ఇంకా పోలేదు.

what is Covid 19 Anti Body Test  who should take it

ప్రస్తుతం ఒమిక్రాన్‌ రూపంలో కరోనా మరోమారు పంజా విసురుతోంది. ఇది అంత ప్రాణాంతకం కానట్లు తెలుస్తున్నప్పటికీ వైరస్‌ వ్యాప్తి గత వేరియెంట్ల కన్నా ఎక్కువగా ఉండడం కలవరపెడుతోంది. దీని వల్ల మరిన్ని వేరియెంట్లు పుట్టుకొచ్చే అవకాశం లేకపోలేదని నిపుణులు అంటున్నారు.

అయితే కరోనా నేపథ్యంలో మనకు తరచూ వినబడుతున్న మాట.. యాంటీ బాడీ టెస్టు. ఇంతకీ అసలు ఇదేమిటి ? దీన్ని ఎవరు చేయించుకోవాలి ? దీని వల్ల ఏం తెలుస్తుంది ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

యాంటీ బాడీ టెస్టును ఎప్పుడైనా చేయించుకోవచ్చు. దీనికి ఉపవాసం ఉండాల్సిన పనిలేదు. రక్త నమూనా ఆధారంగా ఈ టెస్టు చేస్తారు. ఇందులో కోవిడ్‌ యాంటీ బాడీ ఐజీజీ, యాంటీ బాడీస్‌ టోటల్‌ అని రెండు టెస్టులు ఉంటాయి. ఒక టెస్టు చేస్తే రెండు రిజల్ట్స్‌ వస్తాయి. రిజల్ట్స్‌ వచ్చేందుకు సుమారుగా 24 నుంచి 48 గంటల సమయం పడుతుంది.

ప్రస్తుతం చాలా డయాగ్నస్టిక్‌ సెంటర్లలో, హెల్త్‌ యాప్‌లలో కోవిడ్‌ యాంటీ బాడీ టెస్టులను చేస్తున్నారు. హెల్త్‌ యాప్‌లలో అయితే డిస్కౌంట్‌లకే రూ.400 నుంచి రూ.600 వరకు ఈ టెస్టును చేస్తున్నారు. టెస్ట్‌ బుక్‌ చేస్తే యాప్‌కు చెందిన సిబ్బంది ఇంటికే వచ్చి శాంపిల్‌ తీసుకుంటారు. తరువాత 24 నుంచి 48 గంటల్లో రిపోర్టులను ఈ-మెయిల్‌కు పంపిస్తారు.

what is Covid 19 Anti Body Test  who should take it

ఇక యాంటీ బాడీ టెస్టు వల్ల మన శరీరంలో యాంటీ బాడీలు ఉన్నాయా, లేదా.. అనే విషయాలు తెలుసుకోవచ్చు. కోవిడ్‌ నుంచి రికవరీ అయిన వారు తమలో యాంటీ బాడీలు ఉన్నాయా, లేదా అని తెలుసుకునేందుకు ఈ టెస్టును చేయించుకోవచ్చు.

అలాగే వ్యాక్సిన్‌ తీసుకున్న తరువాత యాంటీ బాడీలు తయారవుతాయి.. కనుక వ్యాక్సిన్‌ వేయించుకున్న వారు తమలో యాంటీ బాడీలు ఉన్నాయా, లేదా.. అని తెలుసుకునేందుకు ఈ టెస్టును చేయించుకోవచ్చు. యాంటీ బాడీలు ఉంటే వ్యాక్సిన్‌ పనిచేస్తుందని అర్థం. అయితే కొందరిలో యాంటీ బాడీలు ఏర్పడవు. దీంతో టెస్టుల్లో నెగెటివ్‌ వస్తుంది. అంతమాత్రం చేత వ్యాక్సిన్‌ పనిచేయడం లేదని అనుకోరాదు.

ఇక వ్యాక్సిన్‌ తీసుకోన‌ప్పటికీ.. తమకు కోవిడ్‌ వచ్చి పోయిందా.. అన్న విషయాన్ని నిర్దారించుకునేందుకు యాంటీ బాడీల టెస్టు చేయించుకోవచ్చు. అలాంటి వారిలో యాంటీ బాడీలు ఉంటే వారికి కోవిడ్‌ వచ్చి పోయిందని తెలుస్తుంది. అంటే.. వారిలో ఇమ్యూనిటీ బాగా ఉన్నట్లు లెక్క.

అయితే ఈ టెస్టు పూర్తి స్థాయిలో కచ్చితత్వంతో కూడుకున్నది కాదు. కానీ ఒక అంచనా కోసం ఈ టెస్టును చేయించుకోవచ్చు.

Tags: Covid 19 Anti Body Testకోవిడ్‌ 19 యాంటీ బాడీ టెస్టు
Previous Post

Couples : శృంగార సామర్థ్యం పెరిగి.. యాక్టివ్‌గా పాల్గొనాలంటే.. వీటిని దంపతులు రోజూ తీసుకోవాలి..!

Next Post

Bananas : ప్రతి రోజూ ఒక అరటి పండును తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..!

Related Posts

information

ప్ర‌తి పెట్రోల్ పంప్‌ లో…… ఈ 10 స‌దుపాయాలు త‌ప్ప‌కుండా ఉండాలి.!!

July 8, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

పిల్లలు పుట్టకపోవడానికి… మనకు తెలియని ఓ కారణం ఏంటో తెలుసా?

July 8, 2025
lifestyle

ఈ దేశం రాజ‌ధాని న‌గరాన్ని కాలి న‌డ‌క‌న చుట్టి రావ‌డానికి కేవ‌లం ఒక్క రోజు చాల‌ట తెలుసా..?

July 8, 2025
హెల్త్ టిప్స్

రాత్రి పూట మీరు నిద్రిస్తున్నా కూడా శరీర బ‌రువును త‌గ్గించాలంటే.. ఇలా చేయండి..!

July 8, 2025
హెల్త్ టిప్స్

డ‌యాబెటిస్ ఉన్న‌వారు కిడ్నీల‌ను ఆరోగ్యంగా ఉంచుకోవాలి.. ఎందుకంటే..?

July 8, 2025
వైద్య విజ్ఞానం

గుండె నొప్పి వ‌చ్చింద‌ని తెలుసుకోవ‌డం ఎలా..? ఏ విధమైన ల‌క్ష‌ణాలు ఉంటాయి..?

July 8, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
హెల్త్ టిప్స్

డ‌యాబెటిస్ ఉన్న‌వారు త‌మ పాదాల పట్ల ఈ జాగ్ర‌త్త‌లను తీసుకోవ‌డం త‌ప్ప‌నిసరి..!

by Admin
July 6, 2025

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
డ్రింక్స్‌

Oats Chocolate Milk Shake : బాగా ఆక‌లిగా ఉన్న‌ప్పుడు క్ష‌ణాల్లో దీన్ని చేసుకుని తాగండి.. త‌క్ష‌ణ‌మే శ‌క్తి ల‌భిస్తుంది..

by D
October 29, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.