Bananas : చిన్నప్పటి నుంచి మనం ఒక వాక్యాన్ని ఎప్పుడూ వింటూనే ఉంటాం. అదే.. రోజూ ఒక యాపిల్ పండును తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం రాదని.. వింటుంటాం. అయితే కేవలం యాపిల్ మాత్రమే కాదు.. మనకు అరటి పండు కూడా అలాగే పనిచేస్తుంది. రోజూ ఒక అరటి పండును తింటే దాంతో ఎన్నో లాభాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి అరటి పండును రోజూ ఒకటి చొప్పున తింటుంటే శరీరంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి.. ఏం జరుగుతుంది.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందామా..!
1. మన జీర్ణవ్యవస్థలో మంచి బాక్టీరియా కూడా ఉంటుందన్న విషయం విదితమే. అక్కడ చేరే చెడు బాక్టీరియాను తొలగించేందుకు మంచి బాక్టీరియా సహాయ పడుతుంది. అయితే రోజూ ఒకటి అరటి పండును తినడం వల్ల జీర్ణవ్యవస్థలో మంచి బాక్టీరియా పెరుగుతుంది. దీంతో జీర్ణవ్యవస్థలో ఉండే చెడు బాక్టీరియా బయటకు పోతాయి. వ్యర్థాలు బయటకుపోయి ఆ వ్యవస్థ శుభ్రంగా మారుతుంది. అలాగే జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా మలబద్దకం, అజీర్ణం, గ్యాస్, అసిడిటీ బాధించవు. ఈ సమస్యలు ఉన్నవారు రోజూ ఒక అరటి పండును తినడం ఎంతగానో మేలు చేస్తుంది.
2. అరటి పండును రోజుకు ఒకటి చొప్పున తినడం వల్ల బరువును తగ్గించుకోవచ్చు. ఇందులో ఫైబర్, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయకుండా చేస్తాయి. దీంతో ఆహారాన్ని తక్కువగా తీసుకుంటారు. ఫలితంగా బరువు తగ్గడం తేలికవుతుంది.
3. అరటి పండును రోజుకు ఒకటి చొప్పున తినడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగు పడుతుంది. అరటి పండ్లలో ఉండే మాంగనీస్ మన శరీరంలో కొల్లాజెన్ లెవల్స్‌ను పెంచుతుంది. కొల్లాజెన్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అందువల్ల రోజుకు ఒక అరటి పండును తింటే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
4. రోజూ చాలా మంది శక్తి లేనట్లు నిస్సత్తువగా ఉంటారు. యాక్టివ్‌గా పనిచేయలేరు. కొందరికి ఎల్లప్పుడూ నీరసంగా ఉంటుంది. ఇక కొందరికైతే తక్కువ పనిచేసినా వెంటనే అలసట వచ్చేస్తుంది. అలాంటి వారు రోజుకు ఒక అరటి పండును తింటే ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. అరటి పండును రోజూ తినడం వల్ల శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి.
5. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు లేదా గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నవారు రోజుకు ఒక అరటి పండును తినడం ఎంతగానో మేలు చేస్తుంది. అరటి పండ్లలో పొటాషియం ఉంటుంది. ఇది బీపీని తగ్గిస్తుంది. రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
6. అరటి పండ్లలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. అందువల్ల కంటి సమస్యలు ఉన్నవారు, దృష్టి లోపం ఉన్నవారు రోజుకు ఒక అరటి పండును తింటే మంచిది. దీంతో కంటి చూపు పెరుగుతుంది. నేత్ర సమస్యలు పోతాయి.