Aadavallu Meeku Joharlu Movie Review : శర్వానంద్,రష్మిక మందన్నలు హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం.. ఆడవాళ్లు మీకు జోహార్లు. ఈ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ జోనర్‌లో ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందులు పడుతున్న శర్వానంద్‌కు ఈ సినిమా అయినా హిట్‌ను అందించిందా.. లేదా.. అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కథ..
చిరు (శర్వానంద్)కు వయస్సు మీద పడుతుంటుంది. కానీ పెళ్లి కాదు. తన కుటుంబ సభ్యులు ఏ సంబంధం తెచ్చినా అతను రిజెక్ట్ చేస్తుంటాడు. ఈ క్రమంలోనే ఆద్య (రష్మిక మందన్న)తో అతనికి పరిచయం అవుతుంది. అయితే అప్పటి వరకు పెళ్లి అంటే రిజెక్ట్ చేసిన చిరు.. రష్మిక మందన్నను చూడగానే ప్రేమలో పడిపోతాడు. మరి చివరకు అతని ప్రేమ ఫలించిందా ? పెళ్లి చేసుకున్నాడా ? అందుకు అతను ఎలాంటి కష్టాలు పడ్డాడు ? అన్న వివరాలు తెలియాలంటే.. సినిమాను వెండితెరపై చూడాల్సిందే.
ఈ సినిమాలో చాలా మంది నటీనటులు ఉన్నారు. వారందరూ తమ పాత్రల్లో బాగానే నటించారు. అనేక చోట్ల కామెడీ సీన్లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. ఆద్య కోసం చిరు పడే కష్టాలు నవ్వు తెప్పిస్తాయి. ఈ మూవీని పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ జోనర్‌లో తెరకెక్కించారు. కనుక ఫ్యామిలీ అందరూ కలసి ఈ సినిమా చూడవచ్చు. పక్కా ఎంటర్‌టైన్‌మెంట్ లభిస్తుంది. ఈ సినిమాతో శర్వానంద్‌కు రిలీఫ్ వచ్చినట్లే అనిపిస్తోంది. సినిమా ట్విట్టర్ రివ్యూ ప్రకారం.. బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంటుందని అంటున్నారు.
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాలు గతంలో ఎన్నో వచ్చాయి. శర్వానంద్ కూడా అలాంటి చిత్రాల్లో నటించాడు. అవి హిట్ అయ్యాయి. అందుకనే అతను మళ్లీ అదే జోనర్‌ను నమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాలో బలమైన కథ ఉంటే పక్కా హిట్ గ్యారెంటీ. దీంతోపాటు చాలినంత కామెడీ ఉండాలి. అవి రెండూ ఈ సినిమాలో దండిగా ఉన్నట్లు సినిమా ట్రైలర్‌ను చూస్తేనే అర్థమైంది. కనుక శర్వానంద్ చాలా రోజుల తరువాత మళ్లీ ఈ సినిమాతో హిట్ కొట్టి ట్రాక్‌లో పడ్డాడనే చెప్పవచ్చు. ఇక మొత్తంగా చెప్పాలంటే.. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా.. ఫ్యామిలీ అందరూ కలసి చూడాల్సిన మూవీ..!