నాగచైతన్య, సమంతలపై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ తో ఒక్కసారిగా దుమారం చెలరేగినట్లు అయింది. దీంతో ఎక్కడ చూసినా ఆమె వ్యాఖ్యలే ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆమె తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు. దీంతో టీపీసీసీ చీఫ్ ఇక ఇంతటితో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని కోరారు. అయితే మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీ ప్రముఖులు స్పందిస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు.
సినీ కుటుంబాలు, సినీ ప్రముఖులు చేసిన నిరాధారమైన, కించపరిచేటువంటి మాటలను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇలాంటి ప్రవర్తన తెలుగు సంస్కృతి, విలువలకు విరుద్ధం. ఇలాంటి బాధ్యతా రాహిత్యమైన చర్యలను అంగీకరించకూడదు. మహిళల పట్ల బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సి ఉంటుంది. వారి గోప్యతను గౌరవించాలని కోరుకుంటున్నా.. అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.
అయితే మరోవైపు మంత్రి కొండా సురేఖ తన కామెంట్స్‌పై వివరణ ఇచ్చారు. సొంత శక్తితో సినీ ఇండస్ట్రీలో పైకి వచ్చిన సమంత అంటే తనకు ఎంతో గౌరవమని, కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో సమంతపై కామెంట్స్ చేశానని, ఆమె అంటే తనకు ఎంతో ఇష్టం, అభిమానమని చెప్పారు. అయితే ఈ వివాదం ఇంకా ఎంత ముందుకు వెళ్తుందో చూడాలి.