Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Aloo Garlic Fry : ఆలుగ‌డ్డ‌ల‌ను ఇలా ఎప్పుడైనా ఫ్రై చేశారా.. ఒక్క‌సారి చేసి చూడండి.. బాగుంటుంది..

D by D
January 27, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Aloo Garlic Fry : మ‌నం బంగాళాదుంప‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌తో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. బంగాళాదుంప‌ల‌తో చేసుకోద‌గిన వంట‌కాల్లో బంగాళాదుంప ఫ్రై ఒక‌టి. దీనిని పిల్ల‌ల‌తో స‌హా అంద‌రూ ఇష్టంగా తింటారు. ఈ బంగాళాదుంప ఫ్రై లో కారం పొడి, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి మ‌నం మ‌రింత రుచిగా కూడా చేసుకోవ‌చ్చు. ఈ విధంగా చేసిన ఫ్రై కూడా చాలా రుచిగా ఉంటుంది. వెల్లుల్లి రెబ్బలు వేసి మ‌రింత రుచిగా బంగాళాదుంప ఫ్రైను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలూ గార్లిక్ ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చిన్న ముక్క‌లుగా త‌రిగిన బంగాళాదుంప‌లు – అర కిలో, ప‌సుపు – అర టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2.

Aloo Garlic Fry recipe in telugu make in this method
Aloo Garlic Fry

మసాలా దినుసులు..

ప‌ల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, ధ‌నియాలు – ఒక టేబుల్ స్పూన్, శ‌న‌గ‌ప‌ప్పు – ఒక టేబుల్ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, ఎండు కొబ్బ‌రి – రెండు ఇంచుల ముక్క‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 12, ఎండుమిర్చి – 6, నువ్వులు – ఒక టీ స్పూన్.

ఆలూ వెల్లుల్లి ఫ్రై త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో ప‌ల్లీలు, ధ‌నియాలు, జీల‌క‌ర్ర‌, మెంతులు, శ‌న‌గ‌ప‌ప్పు, ఎండు కొబ్బ‌రి ముక్క‌లు వేసి వేయించాలి. త‌రువాత నువ్వులు, ఎండుమిర్చి వేసి వేయించాలి. ఈ దినుసుల‌న్నీ చ‌ల్లారిన త‌రువాత వాటిని జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి రెబ్బ‌లు కూడా వేసి బ‌ర‌క‌గా మిక్సీ ప‌ట్టుకుని ప‌క్క‌కు ఉంచాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక బంగాళాదుంప‌లు వేసి వేయించాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై క‌లుపుతూ క‌ర‌క‌రలాడే వ‌ర‌కు వేయించాలి. బంగాళాదుంప ముక్క‌లు వేగిన త‌రువాత ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు, మిక్సీ ప‌ట్టుకున్న పొడి, ఉప్పు, ప‌సుపు వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో 5 నిమిషాల పాటు క‌లుపుతూ వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ గార్లిక్ ఫ్రై త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, పుల్కా వంటి వాటితో తిన‌వ‌చ్చు. అలాగే ప‌ప్పు, సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా కూడా తిన‌వ‌చ్చు. బంగాళాదుంప‌ల‌తో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా ఫ్రైను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ ఫ్రైను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Aloo Garlic Fry
Previous Post

Sorakaya Fry : సొర‌కాయ‌ల‌తో ఫ్రై ని ఇలా చేయాలి.. ఎవ‌రైనా స‌రే ఇష్టంగా తింటారు..

Next Post

Gas Trouble Home Remedies : రోజూ ప‌ర‌గ‌డుపున ఒక‌టి తింటే.. గ్యాస్ ట్ర‌బుల్ మాయం..

Related Posts

ఆధ్యాత్మికం

కుంభ మేళాకు నాగ‌సాధువులు ల‌క్షలాదిగా ఒకేసారి వ‌చ్చి ఎలా వెళ్తారు..?

July 4, 2025
Off Beat

స‌హాయం చేసే వారంద‌రూ స్నేహితులు కారు.. గొప్ప క‌థ‌..!

July 4, 2025
mythology

ఫినిక్స్ పక్షి ప్రత్యేకత ఏమిటి ? ఇది వాస్తవంగా గతంలో మనుగడలో వుండిందా ? లేదా ఇదంతా కేవలం కాల్పానికమేనా ?

July 4, 2025
వైద్య విజ్ఞానం

షుగ‌ర్ వ్యాధి కంట్రోల్‌లో ఉండ‌క‌పోతే కిడ్నీలు చెడిపోతాయా..?

July 4, 2025
ఆధ్యాత్మికం

మీకు శ‌నిదోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటిస్తే మంచిది..!

July 3, 2025
ఆధ్యాత్మికం

ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయంటే..?

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.