Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Aloo Vankaya Vepudu : అన్నం లేదా చ‌పాతీలు.. ఎందులోకి అయినా స‌రే ఆలూ వంకాయ వేపుడు రుచిగా ఉంటుంది..

D by D
December 12, 2022
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Aloo Vankaya Vepudu : మ‌నం వంకాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. అలాగే బంగాళాదుంప‌ల‌తో కూడా ఎంతో రుచిగా ఉండే వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. విడివిడిగా కాకుండా ఇవి రెండు క‌లిపి కూడా మ‌నం వంట‌ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఇవి రెండు కూడా మ‌న ఆరోగ్యానికి మేలు చేసేవే. వంకాయ‌, బంగాళాదుంప‌ల‌ను క‌లిపి చేసే వేపుడు చాలా రుచిగా ఉంటుంది. ఒక్క ముద్ద కూడా వ‌దిలి పెట్ట‌కుండా ఇంట్లో అంద‌రూ ఈ కూర‌తో భోజ‌నం చేస్తారు. రుచిగా, సులువుగా ఆలూ వంకాయ వేపుడును ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలూ వంకాయ వేపుడు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

వంకాయ‌లు – అర‌కిలో, ఉడికించిన బంగాళాదుంప‌లు – పావు కిలో, ఎండుమిర్చి – 10, వెల్లుల్లి రెబ్బ‌లు -4,నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, వేయించి పొట్టు తీసిన ప‌ల్లీలు – 2 టేముల్ స్పూన్స్, ల‌వంగాలు – 4, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, క‌చ్చా ప‌చ్చ‌గా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 3, స‌న్న‌గా పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – అర టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Aloo Vankaya Vepudu recipe in telugu perfect for rice or chapati
Aloo Vankaya Vepudu

ఆలూ వంకాయ వేపుడు త‌యారీ విధానం..

ముందుగా వంకాయ‌ల‌ను చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసి ఉప్పు నీటిలో వేసుకోవాలి. బంగాళాదుంప‌ల‌పై పొట్టును తీసి ముక్క‌లుగా చేసుకుని ప‌క్క‌కు పెట్టుకోవాలి. త‌రువాత ఒక జార్ లో ఎండుమిర్చి, నువ్వులు, ల‌వంగాలు, దాల్చిన చెక్క‌, వెల్లుల్లి రెబ్బ‌లు, ప‌ల్లీలు వేసి మ‌రీ మెత్త‌గా కాకుండా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇప్పుడు ఒక క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ‌, ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు, దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత వంకాయ ముక్క‌లు, ఉప్పు వేసి క‌లుపుకోవాలి. వీటిపై మూత పెట్టి మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ వంకాయ ముక్క‌ల‌ను పూర్తిగా వేయించుకోవాలి.

వంకాయ ముక్క‌లు వేగిన త‌రువాత బంగాదుంప ముక్క‌లు వేసి 2 నిమిషాల పాటు క‌లుపుతూ వేయించాలి. త‌రువాత ప‌సుపు, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా, ముందుగా మిక్సీ ప‌ట్టుకున్న పొడి వేసి క‌లుపుకోవాలి. దీనిని మ‌రో 3 నిమిషాల పాటు వేయించి కొత్తిమీర‌ను చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ వంకాయ వేపుడు త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ వేపుడును అంద‌రూ ఇష్టంగా తింటారు.

Tags: Aloo Vankaya Vepudu
Previous Post

Fruits : అధిక బ‌రువును, పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును క‌రిగించే.. 6 అద్భుత‌మైన సూప‌ర్ ఫ్రూట్స్‌.. రోజూ త‌ప్ప‌క తినాలి..

Next Post

Aloe Vera : క‌ల‌బంద‌లో దాగి ఉన్న ఆరోగ్య ర‌హ‌స్యాలు ఇవే.. తెలిస్తే వెంట‌నే ఉప‌యోగిస్తారు..

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.