Ananya Nagalla : వకీల్ సాబ్ సినిమాతో మరింత పాపులారిటీ తెచ్చుకున్న హీరోయిన్.. అనన్య నాగళ్ల. ఈ మూవీ అందరు నటీనటులకు మంచి పేరును తెచ్చి పెట్టింది. పవన్ కల్యాణ్ సినిమా కనుక ఆయన సినిమాలో లీడ్ రోల్స్‌లో నటిస్తే కచ్చితంగా ఎవరికైనా సరే గుర్తింపు వస్తుంది. ఇక అనన్య నాగళ్ల కూడా అలాగే పాపులర్ అయింది. గతంలో ఆమె మల్లేశం అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది.
సోషల్ మీడియాలోనూ అనన్య నాగళ్ల యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫొటోలను షేర్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫొటోలు మతులు పోగొడుతున్నాయి. ఎద అందాలను ప్రదర్శిస్తూ పర్పుల్ కలర్ టాప్‌లో మెరిసిపోయింది. ఈ క్రమంలోనే ఈమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అనన్య నాగళ్ల ఈ మధ్యే వచ్చిన నితిన్ మ్యాస్ట్రో సినిమాలోనూ నటించింది. ఇక సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శాకుంతలం చిత్రంలోనూ ఈమె నటించింది. ఈ మూవీ త్వరలో విడుదల కానుంది.