Atukulu Pesara Pappu Payasam : మనం అటుకుల పాయసాన్ని తయారు చేస్తూ ఉంటాము. ఈ పాయసం చాలా రుచిగా ఉంటుంది. అలాగే తయారు చేసయడం కూడా చాలా సులభం. ఈ అటుకుల పాయసంలో పెసరపప్పు వేసి మనం మరింత రుచిగా తయారు చేసుకోవచ్చు. అటుకులు, పెసరపప్పు కలిపి చేసే ఈ పాయసం చాలా రుచిగా ఉంటుంది. చాలా సులభంగా దీనిని తయారు చేయవచ్చు. పండగలకు అలాగే స్పెషల్ డేస్ లో లేదా తీపి తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా పాయసాన్ని తయారు చేసుకుని తినవచ్చు. ఎంతో కమ్మగా తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ అటుకుల పెసరపప్పు పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అటుకుల పెసరపప్పు పాయసం తయారీకి కావల్సిన పదార్థాలు..
పెసరపప్పు -అర కప్పు , నెయ్యి – 3 టేబుల్ స్పూన్స్, ఎండు ద్రాక్ష – 3 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు – 3 టేబుల్ స్పూన్స్, దొడ్డు అటుకులు – ఒక కప్పు, పాలు – అరలీటర్, బెల్లం తరుగు – ఒక కప్పు, దంచిన యాలకులు – 4, జాజికాయ పొడి – 2 చిటికెలు.
అటుకుల పెసరపప్పు పాయసం తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో పెసరపప్పును కడిగి వేసుకోవాలి. తరువాత తగినన్నినీళ్లు పోసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో అటుకులు వేసి 3 నిమిషాలపాటు వేయించాలి. తరువాత ఉడికించిన పప్పు వేసి 2 నిమిషాల పాటు వేయించాలి. తరువాత పాలు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. పాలు ఒక పొంగు వచ్చిన తరువాత మటంను చిన్నగా చేసి బెల్లం వేసి కలపాలి. బెల్లం కరిగి పాలు కొద్దిగాచిక్కబడిన తరువాత యాలకుల పొడి, జాజికాయ పొడి వేసి కలపాలి. దీనిని మరో 2 నిమిషాల పాటు ఉడికించి వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే అటుకుల పెసరపప్పు పాయసం తయారవుతుంది. దీనిని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఈ పాయసాన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.