Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Beerakaya Masala Curry : బీర‌కాయ‌ల‌తో మ‌సాలా కూర‌ను ఇలా చేస్తే.. ఇష్టం లేని వారు కూడా లాగించేస్తారు..!

D by D
December 18, 2022
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Beerakaya Masala Curry : మ‌నం బీర‌కాయ‌ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. బీర‌కాయ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. బ‌రువు త‌గ్గ‌డంలో, జీర్ణ శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, కంటిచూపు పెరిగేలా చేయ‌డంలో, డ‌యాబెటిస్ ను నియంత్రించ‌డంలో ఇలా అనేక విధాలుగా బీర‌కాయ మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బీర‌కాయ‌తో చేసే కూర‌ల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. బీర‌కాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. అందులో భాగంగా బీర‌కాయ‌ మ‌సాలా కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

బీరకాయ మ‌సాలా క‌ర్రీ త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు..

త‌రిగిన బీర‌కాయ‌లు – పావు కిలో, త‌రిగిన ట‌మాటాలు – 2, త‌రిగిన ఉల్లిపాయ – 1, తరిగిన ప‌చ్చిమిర్చి – 2, ఎండుకొబ్బ‌రి ముక్క‌లు – 2 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ల‌వంగాలు – 3, ధ‌నియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, క‌రివేపాకు – ఒక రెమ్మ‌.

Beerakaya Masala Curry recipe in telugu tastes better with rice
Beerakaya Masala Curry

బీర‌కాయ మ‌సాలా క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా ఒక జార్ లో ఎండు కొబ్బ‌రి ముక్క‌లు, నువ్వులు, ఉల్లిపాయ ముక్క‌లు, అల్లం వెల్లుల్లి పేస్ట్, దాల్చిన చెక్క‌, ల‌వంగాలు, కొద్దిగా నీళ్లు పోసి మెత్త‌ని పేస్ట్ గా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి అవి మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత బీర‌కాయ ముక్క‌లు వేసి నీళ్లూరే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న మ‌సాలా పేస్ట్, ఉప్పు, కారం, ప‌సుపు, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా వేసి అంతా క‌లిసేలా బాగా క‌లుపుకోవాలి. త‌రువాత ఒక గ్లాస్ నీళ్లు పోసి క‌లిపి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత కొత్తిమీర‌ను చ‌ల్లి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బీర‌కాయ మ‌సాలా క‌ర్రీ త‌యారవుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటి వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. బీర‌కాయ‌ల‌తో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు ఇలా మ‌సాలా కూర‌ను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ కూర‌ను అంద‌రూ ఇష్టంగా తింటారు.

Tags: Beerakaya Masala Curry
Previous Post

Gummadi Vadiyalu : బూడిద గుమ్మ‌డికాయ‌ల‌తో వ‌డియాల‌ను ఇలా పెట్టుకోవ‌చ్చు.. అన్నంలో క‌లిపి తింటే బాగుంటాయి..

Next Post

Hair Growth Pack : ఊడిన చోటే వెంట్రుక‌లు మ‌ళ్లీ రావాలంటే.. జుట్టు ఒత్తుగా పెర‌గాలంటే.. ఇలా చేయండి..!

Related Posts

హెల్త్ టిప్స్

ఈ ఆహారాల‌ను రోజూ తింటే చాలు.. మీ ర‌క్తం శుభ్రంగా మారుతుంది..!

July 5, 2025
వ్యాయామం

మీ ఇంట్లోనే ఈ వ్యాయామాల‌ను చేయండి.. పైసా ఖ‌ర్చు లేకుండా బ‌రువు త‌గ్గుతారు..!

July 5, 2025
ప్ర‌శ్న - స‌మాధానం

4 ఏళ్ల నుంచి షుగ‌ర్‌కు మందులు వాడుతున్నా.. ఆయుర్వేద మందులతో త‌గ్గుతుందా..?

July 5, 2025
వినోదం

కేవ‌లం క‌న్య‌ల‌కు మాత్ర‌మే ప్ర‌వేశం ఉన్న ఆల‌యం అది.. ఆ ఊర్లో ఉంది.. త‌రువాత ఏమైంది..?

July 5, 2025
viral news

అంతర్వేదిలో స్నానానికి వెళ్లొద్దని పోలీసుల హెచ్చరిక..ఆ నీళ్లలో ఏముంది?

July 5, 2025
Off Beat

పని చెయ్యకపోతే… అంతే సంగతులు.. ఫ‌న్నీ స్టోరీ..!

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.