Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Bhindi 65 : బెండ‌కాయ‌ల‌తో ఎంతో రుచిక‌ర‌మైన భిండీ 65.. ఇంట్లోనూ ఇలా చేసుకోవ‌చ్చు..

D by D
January 15, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Bhindi 65 : బెండ‌కాయ‌ల‌తో చేసే వివిధ ర‌కాల వంట‌కాల్లో బెండ‌కాయ 65 కూడా ఒక‌టి. దీనిని మ‌న‌కు విందుల్లో ఎక్కువ‌గా వండిస్తూ ఉంటారు. అలాగే క‌ర్రీ పాయింట్ ల‌లో కూడా ఈ వంట‌కాన్ని ఎక్కువ‌గా త‌యారు చేస్తూ ఉంటారు. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ బెండ‌కాయ 65 ను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. బెండ‌కాయ 65 ను ఏ విధంగా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివరాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

బెండ‌కాయ 65 త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

లేత బెండ‌కాయ‌లు – అర కిలో, అల్లం – ఒక ఇంచు ముక్క‌, ప‌చ్చిమిర్చి – 5, వెల్లుల్లి రెబ్బ‌లు – 6, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, శ‌న‌గ‌పిండి – పావు క‌ప్పు, బియ్యం పిండి – పావు క‌ప్పు, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా, ప‌ల్లీలు – పావు క‌ప్పు, క‌రివేపాకు – రెండు రెమ్మ‌లు, గ‌రం మ‌సాలా – పావు టీ స్పూన్, ప‌చ్చి కొబ్బ‌రి తురుము – 2 టీ స్పూన్స్.

Bhindi 65 recipe in telugu how to make this
Bhindi 65

బెండ‌కాయ 65 త‌యారీ విధానం..

ముందుగా బెండ‌కాయ‌ల‌ను శుభ్రంగా క‌డిగి త‌డి లేకుండా తుడుచుకుని ముక్క‌లుగా చేసుకోవాలి. ఇప్పుడు జార్ లో అల్లం ముక్క‌లు, ప‌చ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత బెండ‌కాయ ముక్క‌లను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత అందులో శ‌న‌గ‌పిండి, బియ్యం పిండి, కారం, ఉప్పు, జీల‌క‌ర్ర‌, మిక్సీ ప‌ట్టుకున్న పేస్ట్ వేసి క‌ల‌పాలి. తరువాత రెండు లేదా మూడు టీ స్పూన్ల నీళ్లు పోసి పిండిని ముక్క‌ల‌కు ప‌ట్టించాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ప‌ల్లీలు వేసి వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత క‌రివేపాకు వేసి వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు బెండ‌కాయ ముక్క‌ల‌ను వేసి వేయించుకోవాలి.

వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై క‌ర‌కర‌లాడే వ‌ర‌కు వేయించుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత వాటిలో గ‌రం మసాలా, ప‌చ్చి కొబ్బ‌రి తురుము వేసి క‌ల‌పాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బెండ‌కాయ 65 త‌యార‌వుతుంది. దీనిని ప‌ప్పు, సాంబార్, ర‌సం వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. బెండ‌కాయ‌ల‌తో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా బెండ‌కాయ 65 ను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Tags: Bhindi 65
Previous Post

Shankhpushpi : ఈ పువ్వులు ఎక్క‌డ క‌నిపించినా స‌రే.. అస‌లు విడిచిపెట్ట‌కండి.. ఎందుకో తెలుసా..?

Next Post

Uthappam : ఊత‌ప్పాన్ని ఇలా వేసుకోవాలి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..

Related Posts

technology

వెబ్‌సైట్ల‌ను ఓపెన్ చేస్తున్న‌ప్పుడు 401, 403, 404, 500 అనే ఎర్రర్ మెసేజ్‌లు వ‌స్తాయి క‌దా.. వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

July 5, 2025
హెల్త్ టిప్స్

మీకు హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే ఈ ఆహారాల‌ను తిన‌డం త‌ప్పనిస‌రి..!

July 5, 2025
పోష‌ణ‌

మ‌న శ‌రీరానికి బి విట‌మిన్ ఎందుకు కావాలి..? దీంతో ఏం జ‌రుగుతుంది..?

July 5, 2025
హెల్త్ టిప్స్

రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపునే బిల్వ ప‌త్రాల‌ను తినండి.. ఎన్నో అద్భుతాలు జ‌రుగుతాయి..!

July 5, 2025
హెల్త్ టిప్స్

పొరబాటున పురుగులు ఉన్న మామిడిపండు తినేస్తే ఏమవుతుంది? అది ప్రమాదకరమా? ఏం చేయాలి?

July 5, 2025
international

తాజ్‌మ‌హ‌ల్ మీద అప్ప‌ట్లో వెదురు క‌ప్పారు.. ఎందుకో తెలుసా..?

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.